వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై మరో కేసు నమోదైంది.. జగన్ పర్యటనపై ఇప్పటి దాకా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.. అనుమతి లేక పోయినా వైఎస్ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారని కేసు నమోదు చేశారు పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొచ్చారని మరో కేసు పెట్టారు..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.. అంతేకాదు, ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు రాబోతున్నారు వైఎస్ జగన్?. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారిని పరామర్శించేందుకు బంగారుపాళ్యం…