Site icon NTV Telugu

Police Officers Association: పోలీసులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు తగవు

Police Officers Association: పోలీసుల్ని బెదిరించేలా రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికింది ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం. పోలీసులపట్ల మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంఘం మండిపడింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిన్న జరిగిన ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలలో ప్రసంగించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాను హోం మంత్రిని కావాలని కోరుకుంటున్నానన్నారు.

అలా హోం మంత్రి అయితే పోలీసులపై షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసుల సంగతి తేలుస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేశారని, ఇది ఎంతమాత్రం తగదని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ అయ్యన్నపాత్రుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గతంలో బాధ్యతాయుతమైన మంత్రిగా పనిచేసి ప్రజాస్వామ్యంలో ఉంటూ పోలీసుల మనోభావాలు దెబ్బతినే విధంగా, బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాం.

Read also: PhonePe Blackmail: ఫోన్‌పేలో రోజుకో రూపాయి.. ఆపై బ్లాక్‌మెయిల్..

ఇటువంటి బాధ్యత లేని ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేని వ్యక్తులు గతంలో మంత్రి పదవులు నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని అభిప్రాయపడుతున్నాం అన్నారు. రూల్ ఆఫ్ లా ను ధృఢ సంకల్పంతో అమలుచేస్తున్న పోలీసులను వివిధ సందర్భాలలో, చాలామార్లు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన రాజకీయ స్వలాభం కోసం, పొలిటికల్ మైలేజీ కోసం వాడుకున్నారన్నారు. పోలీస్ వ్యవస్థ పై అవాకులు చవాకులు మాట్లాడడాన్ని సమాజంలో అందరూ గమనిస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ అయ్యన్న పాత్రుడిపై న్యాయ పోరాటానికి వెనుకాడమని తెలియజేస్తున్నామన్నారు.

Read Also: Gujarat: కోట్లకు వారసురాలు.. అయినా 8 ఏళ్లకే సన్యాసం స్వీకరించింది..

Exit mobile version