Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు, రాజా నగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. 18 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న అంబటి గత రెండు క్రితం బెయిల్ పై విడుదల అయ్యారు. విడుదల అయ్యే సందర్భంగా ఫిబ్రవరి 19వ తేదీన రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరి వెళ్తుండగా, అంబటి రాంబాబుకు పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేశారు.
Read Also: Trump: ‘‘న్యాయమూర్తులు మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’.. టారిఫ్‌లు రద్దు చేయడంపై ట్రంప్ ఆగ్రహం
అయితే, కారులతో భారీ ఊరేగింపుగా వెళ్ళొద్దని, రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై కూడా అధిక వాహనాలతో వెళ్ళకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు జక్కంపూడి రాజా తన అనుచరులతో కలిసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహణ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి, జక్కంపూడి రాజాలతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. ఈ మేరకు రాజమండ్రి ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ ఈ కేసున విచారణ చేస్తున్నారు.
