గోదావరికి వచ్చిన భారీ వరద రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణం అవుతోందా? భద్రాచలం మునక మళ్లీ విభజన సమస్యల్ని లేవనెత్తిందా? ఏడు మండలాల కథ ఏడు చేపల కథని తలపిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు వివాదం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. పోలవరం విషయంలో పాత డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం కేంద్రంగా మాటలయుద్ధం రాజుకుంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ భూభాగానికి ప్రమాదం ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు. ఏపీ మంత్రి బొత్స మరో అడుగు ముందుకేసి ఏపీ, తెలంగాణను కలిపేసి హైదరాబాద్ ను రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.