Site icon NTV Telugu

Bhimavaram: ప్రధాని కాకుండా వేదికపై 11 మందికి చోటు

Prime Minister Modi

Prime Minister Modi

ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్, సీఎం కలిసి ప్రయాణించి భీమవరం చేరుకోనున్నారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం పెదఅమీరంలో నిర్వహించనున్న బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

Read Also: Indigo: సిక్ లీవ్ పేరుతో ఉద్యోగులంతా ఇంటర్వ్యూలకి.. విమాన రాకపోకలు ఆలస్యం

పెద అమీరంలో నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ కాకుండా వేదికపై 11 మంది ఆశీనులు కానున్నారు. ప్రధాని మోదీతో పాటు గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, పురంధేశ్వరి, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు వేదికపై కూర్చోనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు సభ కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాని సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు 60వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 వేల మంది పోలీసులతో ప్రధాని సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version