మంత్రి పదవి రాలేదని ఏపీలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మంత్రి పదవి రాకపోవడంపై పిన్నెల్లిని బుజ్జగించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆయన మాట్లాడారు. మొదట్నుంచీ జగన్ కోసం, పార్టీకోసం పనిచేశాం.
ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి వైఎస్, మూడు సార్లు జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యే అయ్యా. సామాజిక కూర్పులో ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత పెంచడం వల్లే సీనియర్లకు పదవులు దక్కలేదన్నారు పిన్నెల్లి. నేను మంత్రి పదవిని ఆశించాను..మంత్రి పదవి రాలేదని నాకు ఎలాంటి బాధ లేదు.. అసంతృప్తి లేదు.
https://ntvtelugu.com/tammineni-sitaram-sensational-comments/
సీఎం జగన్ ఏం బాధ్యతలు ఇచ్చినా దాన్ని నెరవేర్చుతా. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా.మంత్రి పదవులపై పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. నాకు పదవులపై సీఎం జగన్ నాకు ఏ హామీ ఇవ్వలేదు.. ఇవ్వాల్సిన అవసరం లేదు. సీఎం కోసం పార్టీ కోసం పనిచేశా… ఇకపైనా పనిచేస్తా. సీఎం ఏం జరిగినా పార్టీ పటిష్టత కోసమే పనిచేస్తారు.
మా అనుచరుల ఆందోళనలు రాజీనామాలు ఊహించని పరిణామం.మా అనుచరుల రాజీనామాలు తెలుసుకుని వెంటనే ఆపించాం. పార్టీ బాగు కోసం అందరం కలసి పని చేస్తాం.కేబినెట్ కూర్పులో అసంతృప్తి ఉందని టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోంది. బడుగులకు పెద్ద పీట వేశామనే విషయం ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ పన్నాగం పన్నుతోందని విమర్శించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.