Perni Nani Strong Counters On Pawan Kalyan And Chandrababu Naidu: ఏపీ మాజీమంత్రి పేర్ని నాని తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మోసగాడైతే.. పవన్ కళ్యాణ్ గజ మోసగాడు అని ధ్వజమెత్తారు. సినిమా, సీరియల్ టైటిల్స్ పెడతాడని.. సినిమా కవులు పెట్టిన పేరు ప్రజాకోర్టు అని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వల్ల జరిగిన లాభం ఏంటి? అని ప్రశ్నించారు. ఒక టీ షాప్ వ్యక్తి ఇచ్చిన డబ్బులతో పవన్ ఓ లారీ కొనుగోలు చేసి, దానికి వారాహి పేరు పెట్టాడని అన్నారు. అసలు ఈ మోసాలు ఎందుకని నిలదీశారు. పవన్ ఎన్ని స్థానాలకు పోటీ చేస్తాడో దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే.. ఆ విషయం ధైర్యంగా చెప్పగలడా? అని అడిగారు. నిజాయితీగా, నిఖార్సుగా ఓట్లు అడుక్కోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Tovino Thomas: ఇక భరించలేను బాబోయ్.. ట్రోల్స్ పై పోలీసులకు కంప్లైంట్ చేసిన టోవినో
అంతకుముందు చంద్రబాబు 2047 విజన్‌పై కూడా పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని, ఆయన కాలజ్ఞానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది సుత్తి విజన్ అని, గతంలో చెప్పిన విజన్ 2020 ఏమైందని నిలదీశారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. కనీసం కుప్పంకు నీళ్లు ఇచ్చారా? అని అడిగారు. చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ అని, ప్రాజెక్టుల సందర్శన అంటూ చంద్రబాబు అనవసరమైన హడావుడి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తెచ్చిన పథకం కనీసం ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు. పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు విజన్ ఉందా అని ధ్వజమెత్తిన పేర్ని నాని.. విద్యారంగాన్ని ఒక్కసారి కూడా చంద్రబాబు పట్టించుకోలేదు, కనీసం ఒక్క ప్రభుత్వ స్కూల్‌ని కూడా బాగు చేయలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల నుంచి డబ్బులు తీసుకున్న విజన్ చంద్రబాబుది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
LG Suitcase TV: ఎల్‌జీ కంపెనీ నుంచి కొత్త ‘సూట్‌కేస్ టీవీ’..ఫీచర్స్, ధర?
