Site icon NTV Telugu

పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని కౌంటర్.. అదో కిరాయి పార్టీ !

కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్‌ కళ్యాణేనని… రాజకీయ పార్టీని టెంట్‌ హౌస్‌ లా అద్దెకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పేర్ని నాని. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ నిర్మాతల బృందం భేటీ అయింది. ఈ సమావేశం అనంతరం… పవన్‌ కళ్యాణ్‌ మరోసారి కౌంటర్‌ ఇచ్చారు పేర్ని నాని. టాలీవుడ్‌ హీరో చిరంజీవి తనతో మాట్లాడారని… సినీ ఫంక్షన్‌ లో జరిగిన ఘటన పై విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని వివరించారు. ఆ ఫంక్షన్‌ లో వ్యాఖ్యలతో మేం ఏకీభవించబోమన్నారని స్పష్టం చేశారు పేర్ని నాని. ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ కొత్తగా పెట్టింది కాదని… సినిమా రంగం చాలా సున్నితమైన అంశమన్నారు. అనంతరం నిర్మాత దిల్‌ రాజ్‌ మాట్లాడుతూ… సినీ సమస్యలపై సీఎం జగన్‌ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు దిల్‌ రాజు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదన్నారు.

Exit mobile version