Site icon NTV Telugu

Perni Nani: పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఎందుకొచ్చారు మరి..!

Perni Nani

Perni Nani

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైజాగ్‌లో అరెస్ట్‌లు.. అరెస్ట్‌ అయినవారిని విడిపించేవరకు ఇక్కడే ఉంటానంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు.. ముద్దాయిలుగా ఉన్నవారిని, నేరచరిత్ర కలిగిన వారిని బయటికొస్తేనే పిటిషన్ తీసుకుంటానంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.. మీరు రాజకీయం చేస్తున్నారా.. ఫ్యాక్షన్ ముఠాలు నడుపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు.. ఇక, విజయవాడలో ఒక సభ పెట్టారు.. తిరుపతిలో.. వైజాగ్ లో పెట్టారు.. వీరు చేసే కార్యక్రమాలకు హడావుడికి పేపర్లనిండా వార్తలు రావాలని చూస్తుంటారని ఎద్దేవా చేశారు.

మీ డ్రామా కంపెనీలు ఇంకెన్ని రోజులు అంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు పేర్నినాని.. మూడు రోజులు షూటింగ్‌లకు సెలవులు వచ్చాయని.. షెడ్యూల్ ప్రకారం వైజాగ్‌ వచ్చారని ఎద్దేవా చేశారు.. అరెస్ట్‌చేసినవారిని విడుదల చేసేవరకు వైజాగ్‌లోనే ఉంటానన్న పవన్.. పర్మినెంట్‌గా రూమ్‌ అద్దెకు తీసుకుంటారేమో అనుకున్నాను.. కానీ, మిగతావారు విడుదలయ్యే దాకా వైజాగ్‌లో ఎందుకు లేరు.. వైజాగ్‌ నుంచి ఎందుకు వచ్చేశారు అంటూ ఫైర్ అయ్యారు. ఇక, మూడు పెళ్లిళ్లు భరణం కట్టి చేసుకున్నారు.. నువ్వా నీతులు చెప్పేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీతులు, సూక్తులు చెపుతున్నావు.. చాగంటి కోటేశ్వరరావు లాగా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇకనైనా నీతి మాలిన రాజకీయాలు మానుకోండి అంటూ పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.

Exit mobile version