NTV Telugu Site icon

Perni Nani: ఈసారి కూడా గుడివాడలో కొడాలి నానిదే విజయం.. పేర్ని నాని జోస్యం

Perni Nani On Kodali Nani

Perni Nani On Kodali Nani

Perni Nani Says Kodali Nani Will Win As Gudivada MLA For Fifth Time: గుడివాడలో ఈసారి కూడా కొడాలి నాని విజయం సాధిస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని జోస్యం చెప్పారు. అంతేకాదు.. చూడ్డానికి కొడాలి నాని రౌడీలాగా కనిపించినా, అత్యంత తెలివైన వాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడ ఆర్టీసీ డిపో ప్రారంభించిన అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. ఊళ్ళో ఎక్కడ వర్షం వచ్చినా, గతంలో గుడివాడ డిపో గ్యారేజీ వర్షంలో మోకాలు లోతు మునిగేదన్నారు. అలాంటి గ్యారేజీని కొడాలి నాని బాగు చేశారన్నారు. సంవత్సరానికి 3600 కోట్ల జీతాల భారాన్ని మోసి.. ప్రభుత్వంలో సీఎం జగన్ కలిపారన్నారు. రూ. 7300 కోట్లు అప్పులో ఉన్న ఆర్టీసీని.. లాభాల బాట పట్టించేలా ముఖ్యమంత్రి ప్రణాళికలు చేశారని తెలిపారు. రూ. 3000 కోట్ల వరకూ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉండేదని చెప్పారు.

Constipation Problem : టాయిలెట్లో గంటల తరబడి కూర్చున్నా పని కావట్లేదా?

ఏపీఎస్ఆర్టీసీ అప్పులు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయని చెప్పిన పేర్ని నాని.. ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికీ ప్రైవేటుపరం కాదని స్పష్టతనిచ్చారు. పది కోట్లతో గుడివాడ బస్టాండు నిర్మాణానికి టెండర్ పిలవబోతున్నామని చెప్పారు. మే 19న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 8900 ఇళ్ళను సీఎం జగన్ అందజేస్తున్నారని పేర్కొన్నారు. కొత్త పంపుల చెరువు గుడివాడలో పెట్టడానికి 40 నుంచి 50 కోట్లు వరకు మంజూరు చేయనున్నారని వెల్లడించారు. అనంతరం కొడాలి నాని గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో కొడాలి నాని ఈ రాష్ట్రంలోనే అత్యంత తెలివైన వాడని ప్రశంసలతో ముంచెత్తారు. పెద్దగా చదువుకోలేదని డ్రామాలు ఆడతాడని.. గెడ్డం, రుద్రాక్షలతో రౌడీ గెటప్‌లో కనిపిస్తాడు.. అయితే అతని బుర్ర పాదరసం కంటే వేగంగా పని పని చేస్తుందని పొగిడారు. పైకి అమాయకంగా కనిపిస్తాడు కాని అత్యంత తెలివైనవాడన్నారు. కొడాలి నానిని ఓడించడానికి ఇద్దరు పోటీ పడుతున్నారని.. కాన, ఐదోసారి గెలవడానికి కొడాలి నాని ఇప్పటికే స్కచ్ వేసుకున్నాడన్నారు.

PM Modi: కాంగ్రెస్‌వి బుజ్జగింపు రాజకీయాలు.. అభివృద్ధికి అవరోధం..

కాగా.. గుడివాడ ఆర్టీసీ డిపో ప్రారంభోత్సవానికి పేర్ని నానితో పాటు కొడాలి నాని, సింహాద్రి రమేశ్ పాల్గొన్నారు. ఈ డిపోని ఏపీ ప్రభుత్వం రూ.9 కోట్లతో 3 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. పాత డిపో స్ధానంలో కొత్తగా నిర్మాణాన్ని చేపట్టింది. పూర్తి వసతులు, అన్ని హంగులతో ఈ డిపోని నిర్మించారు. మొత్తం బస్టాండు, డిపో నిర్మాణానికి రూ.14 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. బస్ స్టాండ్ పునర్నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. వంద బస్సుల మెయింటెనెన్స్ సామర్ధ్యంతో ఈ డిపోని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.