వైసీపీ ప్లీనరీపై విమర్శలు చేస్తున్నవారిపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ వీకెండ్ ప్రజా సేవ చేస్తున్నారు.అది కూడా నెలలో రెండు ఆదివారాలు మాత్రమే ప్రజా సేవ చేస్తామంటున్నారు.అన్నీ వదులుకుని ప్రజా సేవ చేస్తానంటూ డబ్బా కబుర్లు చెప్పిన పవన్.. ఇప్పుడు వీకెండుకు పరిమితమయ్యారు.లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ స్టేట్మెంటును మూడేళ్ల క్రితమే ప్రజలు అమలు చేశారు.చంద్రబాబుతో కుర్చీ ఖాళీ చేయించి.. ప్రజలు మూడేళ్లు ఏనాడో ఆ కుర్చీలో కూర్చున్నారు. పవన్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వనిది భీమవరం, గాజువాక ప్రజలే తప్ప.. వైసీపీ కాదు.
పవన్ ప్రఖ్యాత చిలక జోస్యుడు. 2019లో జగన్ సీఎం కాడు.. కాలేడు అని పవన్ చిలక జోస్యం చెప్పారు. జగన్ 100 శాతం ప్రజలను నమ్ముకుంటారు.. పవన్ లాగా విమానాల కంపెనీల వాళ్లని.. చంద్రబాబును, మోడీని నమ్ముకోలేదు. ప్రవచనాలు చెప్పే విషయంలో పవన్ చాగంటి కోటేశ్వరరావును మించిపోయారు. పవన్ రాజకీయ ప్రవచనకారుడు అయ్యాడు. కారు అద్దం తీయడం.. చేతులు ఊపడమేనా రాజకీయం. కోనసీమకు అంబేద్కర్ పేరే ఎందుకు పెట్టాలని పవన్ గతంలో అనడం నిజం కాదా..?
ఇప్పుడేమో అంబేద్కర్ పేరు పెడితే స్వాగతించింది తానేనని పవన్ చెప్పుకుంటున్నారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ను వెటకారం ఆడుతూ పవన్ మాట్లాడింది నిజం కాదా..? పవన్ మీకు రౌడీయిజం ఇష్టం లేదా..? మరి పరిటాల రవి ఇంటికెందుకెళ్లారు..? బాగా మర్డర్లు చేశారని పలకరించడానికి వెళ్లారా..? 2014లో దెందులూరులో ఎవరికి ఓటేయమని అడగడానికి పవన్ వెళ్లారు..? దెందులూరు స్వామిజీ వనజాక్షి జుట్టు పట్టుకున్నప్పుడు పవన్ ఏమైనా మాట్లాడారా..? మూడేళ్ల నుంచి పవన్ ఏం దహించుకుపోయారు.. శుభ్రంగా సినిమాలు చేసుకుంటున్నారు. పవన్ సినిమాలను ప్రభుత్వం ఎందుకు దెబ్బ కొడుతుంది..? వకీల్ సాబ్ సినిమాను దెబ్బ కొట్టింది ప్రజలే.
వకీల్ సాబ్ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు తిరిగి ఇచ్చారు. గతం నుంచి తాను చేసిన కామెంట్లను ఓసారి రివైండ్ వేసుకుని చేసుకుంటే పవనుకు తన మీద తనకే అసహ్యం వేస్తుంది. ఊసపవెల్లి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తీశారు.. వాస్తవానికి పవనుకు సరిగ్గా సరిపోయే పేరు. కుల భావన చచ్చిపోయిందని పవన్ బాధ పడడం విచిత్రంగా ఉంది. కులతత్వం ఎక్కువైపోయిందని ఎవరైనా ఆవేదన చెందుతారు.. కానీ కులభావం చచ్చిపోయిందని పవన్ అంటారేంటీ..? అన్నారు పేర్ని నాని.
పవన్ నయా వివేకానందుడు అని ఎద్దేవా చేశారు పేర్ని నాని. రాష్ట్రాన్ని కులాల కుంపటి చేస్తోంది చంద్రబాబే అని గతంలో కామెంట్ చేశారు.. ఆ విషయాన్ని పవన్ మరిచారు. కాపులకు రిజర్వేషన్లేంటీ అంటూ తుని ఘటన సమయంలో చెప్పిన పవన్.. ఇప్పుడు కాపుల గురించి అదే పనిగా మాట్లాడుతున్నారు.అత్యంత పచ్చి అబద్దాలు చెప్పే చంద్రబాబు కూడా సిగ్గు పడే విధంగా పవన్ మాట్లాడుతున్నారు.2014 నుంచి 2019 వరకు పవన్ అధికారంలో లేరా..?సైకిల్ ఓటేయండి.. పువ్వుకు ఓటేయండి అని చెప్పలేదా..?2014-2019 మధ్య కాలంలో అధికారాన్ని పంచుకున్న పవన్ కౌరవుడేనా..?
నాడు చంద్రబాబు ధుర్యోధనుడైతే.. పవన్ దుశాస్సనుడా..?2014-19 మధ్య కాలంలో పైన.. కింద పవన్ అధికారంలో ఉన్నారు.. ఇప్పుడు పైన అధికారంలో ఉన్నారు.శాశ్వత అధ్యక్షుడనే ప్రతిపాదన పెడితే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరు.హరికృష్ణ, పురందేశ్వరీలను మభ్య పెట్టారు కాబట్టి చంద్రబాబుకు ఆ భయం ఉంటుంది.వైసీపీలో అలాంటి భయం లేదు. బీజేపీ నేత సత్యకుమార్ ఎవరు..? ఆటలో అరటిపండులాంటి వాడు సత్య కుమార్.
ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ జగన్ కు ఫోన్ చేసి ముర్ముకు మద్జతివ్వాలని కోరారు.ముర్ము నామినేషన్ దాఖలుకు హాజరు కావాలని పీఎంఓ కోరింది.ఆటలో అరటిపండు లాంటి వాళ్లు ఇవన్నీ తెలుసుకోవాలి.ఆటలో అరటి పండు లాంటి వాళ్లకు ఇవేం చెప్పరు.మేం అంటరాని పార్టీ అయితే ముర్మును దమ్ముంటే మా దగ్గరకు రాకుండా ఆపండి.పార్టీల నిర్మాణం విషయంలో కంట్రోల్ పెట్టేలా చట్ట సవదరణ చేస్తామన్న జీవీఎల్ కామెంట్ చేశారు.శాశ్వత అధ్యక్షునిగా మేం చేసిన తీర్మానం ఈసీకి వెళ్లోలోగా జీవీఎల్ చట్ట సవరణ చేయించగలరా..? అని సవాల్ విసిరారు.
