Site icon NTV Telugu

Perni Nani: కోటంరెడ్డిది అవకాశవాద రాజకీయం.. నిజంగా జగన్‌పై ప్రేమే ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే వెళ్లిపోతారా..?

Perni Nani Satires On Brs

Perni Nani Satires On Brs

Perni Nani: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని.. కోటంరెడ్డిపై విరుచుకుపడ్డారు.. ఫోన్ ట్యాపింగ్ లు చేయడమే ప్రభుత్వ పనా? అని ప్రశ్నించారు.. మూడు నెలల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు చెప్పారు? అని నిలదీశారు.. స్మార్ట్ ఫోన్లలో రికార్డింగ్ ఆప్షన్ కామన్ గా జరుగుతుంది.. కానీ, ఇలా, ముఖ్యమంత్రి గురించి ఎబ్బెట్టుగా మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ లు ప్రచారంలో ఉంటే అధికారులు అలెర్ట్ చేసి ఉంటారన్నారు.. బురద వేయటానికి ఏమైనా మాట్లాడవచ్చు.. ప్రజల్లో సానుభూతి కోసమే ఈ ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు పేర్ని నాని.

Read Also: Union Budget 2023: క్లుప్తంగా కేంద్ర బడ్జెట్..అంకెల్లో ఇలా!

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు పేర్నినాని.. చంద్రబాబే ట్యాపింగ్ సామాన్లు కొనలేదని చెప్పాడు.. మేం కూడా కొనలేదన్న ఆయన.. మరి ఫోన్ ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇవ్వకపోతే వెళ్లిపోతామంటూ ఎలా? అని ప్రశ్నించిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్.. నమ్మి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేలం అయి ఉండేవాళ్ళమా? అని ఫైర్‌ అయ్యారు.. నిజంగా పార్టీ నాయకుడిపై ప్రేమ, భక్తి ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే వెళ్ళి పోతారా? అని నిలదీశారు.. అసలు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది అవకాశవాద రాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి వ్యవహారాలు ఉన్నాయా? ట్యాపింగ్ కి భయపడటానికి.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు.. ఆయన ఎంత ఓపికతో ఉన్నారు.. వాళ్ళు తోపులు కాదా? అంటూ మండిపడ్డారు.. కోర్టులో ఉన్న విషయాలను ఈ పోటుగాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదా? అని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. కాగా, నెల్లూరు పాలిటిక్స్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతూనే ఉన్నాయి.. కోటంరెడ్డి ఎపిసోడ్‌పై అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలు కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్నారు.

Exit mobile version