NTV Telugu Site icon

Perni Nani: లోకేష్‌ కోసం ఐదుగురు మంత్రులను పీకేశారు.. బాంబ్‌ పేల్చిన పేర్నినాని..

Perni Nani

Perni Nani

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. లోకేష్ కి ట్విట్టర్ ఒకటి తేరగా దొరికింది.. ఏదంటే అది ట్వీట్ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు…? అని ప్రశ్నించారు. ఆ రోజు మంత్రి పదవి పీకేస్తే పీతల సుజాత బోరు బోరున విలపించారన్న ఆయన.. మరి అప్పుడు ఇదే మాట తండ్రికి ఎందుకు చెప్పలేదు? మీ హయాంలో బొజ్జల, పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి వారిని పీకెస్తే అప్పుడు ఎందుకు మీ నాన్నకి చెప్పలేదు..? నీకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆ రోజు ఐదుగురి మంత్రి పదవులు పీకారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబుకి ఒక చిన్న సూచన… ఇంత వయసు వచ్చాక కొడుకును అదుపులో పెట్టుకొకపోతే సభ్యత అనిపించుకోదన్నారు.. ఇష్టారాజ్యంగా కారుకూతలు కూస్తుంటే సమాజం హర్షించదు… మీ కొడుకు చేడిపోయాడు అనే మాట బాగుండదు అంటూ సెటైర్లు వేశారు..

Read Also: Venkaiah Naidu: అప్పుడు చాలా బాధపడ్డా.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..

ఇక, సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పేర్నినాని.. దుష్టచతుష్టయంకి రాజధాని అంటే అర్థాలు వేరు, సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు మాత్రం అమరావతిలో స్థలం ఇవ్వకూడదంట.. అలా ఇస్తే సమతుల్యత దెబ్బతింటుంది అంటారు.. జగన్ పై విషం చిమ్మడానికే కొంతమంది ఉన్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు స్థలాలు ఇస్తే మాత్రం వీళ్ళకి సమ్మగా ఉంటుంది.. అదే పేదలకి స్థలాలు ఇస్తే మాత్రం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజధానిలో ఎవరుండాలి.. మనుషులు వద్దా…? ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఏమీ చేద్దామని…? ఈ దుష్ట చతుష్టయానికి బీదా బిక్కీ రాజధానిలో ఉండకూడదు అనేది లక్ష్యం.. పేదలకి గూడు కల్పిద్దామని జగన్ ఆలోచన మాత్రం తప్పు అని మండిపడ్డారు. రాజధానిలో వేరే వారు రాకూడదు.. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి అనేది వాళ్ల ఆలోచన అని ఆరోపించారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల వారికి స్థలాలు ఇస్తే స్టే తెచ్చారని ఆరోపించారు పేర్నినాని.. మరి మేం దాన్ని మా రాజధాని అని ఎందుకు అనుకోవాలి…? ఇప్పుడు పాదయాత్ర 2 అట… కలెక్షన్ ఫుల్.. ప్రజాదరణ నిల్ అని సెటైర్లు వేశారు. బ్లాక్ ను వైట్ చేసుకోవడానికే ఈ యాత్ర… దేనికైనా వ్యాపారమే చేస్తారు అని విమర్శించారు.. విశాఖ పరిపాలన రాజధాని చేయాలని సీఎం అనుకుంటే అక్కడి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తామని ఒక చిన్న సవరణ చేస్తేనే వీళ్ళు కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. 600 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకపోయినా చంద్రబాబు వీరుడు శూరుడు అంటారు.. ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసిన జగన్ విషయంలో ఆ 5 శాతం గురించి రాస్తారని ఫైర్‌ అయ్యారు పేర్నినాని.

Show comments