చీప్ లిక్కర్‌పై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి.. ఏపీలో తాము అధికారంలోకి వస్తే రూ.70 కే చీప్ లిక్కర్ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైదే రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలను అంతా ట్రోల్ చేస్తున్నారు.. అయితే.. సోము వీర్రాజు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా? అని ప్రశ్నించిన ఆయన.. నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: వంగవీటి రాధాపై రెక్కీ.. సీరియస్‌గా స్పందించిన టీడీపీ సీనియర్ నేత
ఇక, బీజేపీ చీప్ డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు శైలజానాథ్.. ప్రత్యేక హోదాపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించరు..? భయమా..? అంటూ నిలదీసిన ఆయన.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నోరు మెదపరా..? అని నిలదీశారు.. డ్రామా ఆర్టిస్టుల్లా సోము వీర్రాజు వ్యాఖ్యలున్నాయని.. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర బీజేపీ దిగజారిందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై నోరు విప్పలేని బీజేపీ నేతలు మద్యం తక్కువ ధరకు ఇస్తామన్న ప్రకటనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమువీర్రాజు పిచ్చి పరాకాష్టకు చేరింది… అమరావతిపై బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారంటూ ఫైల్ అయ్యారు శైలజానాథ్.
