ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా వున్నారు. కౌలు రైతులకు అండగా జనసేన వుంటుందని ప్రకటించిన పవర్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో(West Godavri District) పర్యటిస్తున్నారు. పవన్‌కు ఘన స్వాగతం పలికాకు అభిమానులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల పరామర్శకు వెళ్లారు పవన్. హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డరోడ్డు బైపాస్ దగ్గర ఆయనకి పూలతో స్వాగతం పలికారు జనసైనికులు. అధినేతను చూసిన ఆనందం పట్టలేకో, లేదంటే ఇంకేంటో కానీ జై జగన్ అంటూ నినాదాలు చేయడం కాసేపు గందరగోళానికి కారణం అయింది.
ఏలూరు బైపాస్ మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు.. అక్కడి నుంచి ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ చింతలపూడి లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నారు. 41 మంది రైతులకు ఒకొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్ లు అందిస్తున్నారు. ధర్మాజీగూడెంలో కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు పవన్ కళ్యాణ్.
Read Also: Jeevitha Rajasekhar: కోర్టుల మీద నమ్మకం ఉంది, నేను ఎటూ పారిపోలేదు!