NTV Telugu Site icon

Pawan Kalyan: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక.. ఢిల్లీ దాకా సత్తా చాటారు

Pawan Tribute To Ntr

Pawan Tribute To Ntr

Pawan Kalyan Tribute To NTR Via Twitter: స్వర్గీయ నంద‌మూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఢిల్లీదాకా తెలుగువారి సత్తా చాటారంటూ ఎన్టీఆర్‌ని కొనియాడారు. ఈ మేరకు జనసేన పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పవన్ ప్రకటనని విడుదల చేసింది. ‘‘చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రూ.2లకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది, ఎందరికో అనుసరణీయమైంది’’ అని పవన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Boy Suicide: పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో 17 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

అంతేకాదు.. ఢిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక, తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో ఎన్టీఆర్ నిలిచారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లోనే అజేయమైన విజయాన్ని అందుకుని, తెలుగువారి సత్తాను ఢిల్లీ దాకా చాటారని కీర్తించారు. అటు సినిమా, ఇటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌.. తెలుగుబిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి తన తరఫున, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానని పవన్ తెలిపారు. కాగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయ‌న కుటుంబస‌భ్యులు నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. ఇద్దరూ కలిసి రాలేదు కానీ.. వేర్వేరుగా వచ్చి పుష్పగుచ్చాలు ఉంచి నివాళలర్పించారు.

Perni Nani: హత్య చేసిన చేతులతో.. దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు