Pawan Kalyan: నేడు వైజాగ్‌కి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan To Visit Visakhapatnam Today In His 3 Days Uttarandhra Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. తొలుత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదగా.. నోవాటెల్ హోటల్‌కి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి వాళ్ల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించిన తర్వాత విజయనగరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమం సమయంలోనే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడంతో.. ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అంతకుముందు.. విశాఖ గర్జన ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు. ఆసుపత్రిలో మృతి చెందినవారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చలేనందుకా? కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకొని బైక్ మీద తీసుకువెళ్లేలా చేసినందుకా? అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా? దేనికి మీ గర్జనలు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!