Pawan Kalyan: తన వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అల్లూరి, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్‌కు వందనాలు చెబుతూ తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. అమాయకులను చిన్నాభిన్నం చేస్తున్న శక్తులతో పోరాడుతున్నానని అన్నారు. పదేళ్ల నుంచి జనసేన పోరాటం సాగుతోందని.. తనకు గెలుపోటములు ఉండవని, ప్రయాణమే ఉంటుందని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం జనసేన పోరాటం చేస్తోందన్నారు. భూమిలో విత్తనం పెడితే.. పోరాటం చేసి పైకి ఎదుగుతుందని పేర్కొన్నారు. పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేసే విధంగా రాష్ట్రంలో పరిపాలన ఉందని ఆరోపించారు.
Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదు.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
ఒక వైసీపీ ఎమ్మెల్సీ దళితుడైన తన కారు డ్రైవర్‌ని చంపేసి, డోర్ డెలివరీ చేసినా.. తన అక్కని వేధిస్తున్నారని అడ్డుకున్నందుకు 14 ఏళ్ల బాలుడ్ని కాల్చేసినా.. వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మద్యపానం విషయంలో, మహిళల మిస్సింగ్ కేసుల్లోనూ స్పందన లేదన్నారు. వైసీపీ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం జనసేన సమస్య మాత్రమే కాదని, అందరి సమస్య అని చెప్పారు. తాను గూండా వ్యవస్థకి ఎదురొడ్డి, ఇన్నేళ్ళు నిలబడ్డానన్నారు. యువజన, శ్రామిక, రైతుల పేరు పెట్టుకున్న పార్టీ.. వారిని మోసం చేసిందన్నారు. వారి కోసం ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఉన్నత విద్య చదివిన విద్యార్థులు.. చిన్న ఉద్యోగాల్లోనే ఉండిపోతున్నారన్నారు. యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. విదేశీ విద్యా పథకాన్ని కూడా జగన్ తీసేశారన్నారు.
Pakistan: ఈద్ ప్రార్థనల సమయంలో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..
సంపద ఒకరి దగ్గరే ఉంటే చాలా అనర్థమని.. వెనుకబడ్డ కులాల్లో ఎంతో ప్రతిభ ఉన్న యువకులు ఉన్నారని.. వారిని పైకి తీసుకురావాలని పవన్ అభీష్టించారు. సరైన పాలన లేకపోతే.. ఎంత ప్రతిభ ఉన్నా వృధా అవుతుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు తప్ప వారి అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని తూర్పారపట్టారు. తాను ఊగిపోతూ మాట్లాడుతానని ముఖ్యమంత్రి అంటున్నారని.. జరిగిన అన్యాయం ఏంటో అమర్నాథ్ కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటే, మీరూ ఊగిపోతూ మాట్లాడుతారని అన్నారు. క్లాస్ వార్ చేసే వారు పేరు చివర కులం పేరు పెట్టుకోరన్నారు. ముఖ్యమంత్రి తన పేరు చివర కులం పేరు తీయలేరన్నారు. 30లక్షల మంది భవన కార్మికుల పొట్ట కొట్టిన మీరు చేసేది క్లాస్ వార్ కాదని.. తన సొంత డబ్బు పేదలకు ఇస్తున్నది క్లాస్ వార్ అని అన్నారు. క్లాస్ వార్ అంటూ కార్మికుల పొట్ట కొట్టిన ముఖ్య మంత్రికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Payal Rajput : పాయల్ నటించిన మంగళవారం టీజర్ విడుదల ఎప్పుడో తెలుసా..?
మద్యపాన నిషేదమంటూ మద్యంపై లక్ష కోట్లు సంపాదించారని.. ఎన్నో జీవితాలు నాశనం చేశారని పవన్ కళ్యాణ్ షాకింగ్ ఆరోపణలు చేశారు. మద్యం డబ్బుతో పథకాలు ఇస్తూ.. ఆడవారి పుస్తెలు తెంచుతున్నారని వ్యాఖ్యానించారు. సంపూర్ణ మద్యపానం నిషేదం చాలా కష్టమన్న పవన్.. తాము అధికారంలోకి వస్తే పాత రెట్లకే మద్యం అమ్మకాలు చేపడతామన్నారు. మహిళలు వ్యతిరేకించిన చోట మద్యం అమ్మకాలు నిషేధిస్తామని మాటిచ్చారు. గంగవరం పోర్టు వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారని.. వారి గురించి ఆలోచించని ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో సరైన వసతులు ఉండవని.. అన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టిన విధానాన్ని క్లాస్ వార్ అనాలా, క్యాస్ట్ వార్ అనాలా..? అని నిలదీశారు.
V. Hanumantha Rao: రేవంత్, భట్టి కలిసి పని చేయాలి.. అప్పుడే అధికారంలోకి రావచ్చు..!
కాలవల్లో పూడికలు తీయరు, లాకులు రిపేర్లు చేయలేరు, అయినా రైతు పేరు పార్టీలో పెట్టుకున్నారని.. రైతు పేరు పార్టీ పేరులో నుంచి తీసెయ్యమని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆక్వా రైతులను దోచుకునేందుకు కొత్త జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. అసలు భీమవరం ఎమ్మెల్యే ఎప్పుడైనా డంపింగ్ యార్డ్‌కి వెళ్లారా? అని నిలదీశారు. భీమవరం నుంచి ఎంతోమంది ప్రపంచ నలుమూలలకు వెళ్ళారని.. డంపింగ్ యార్డ్, 100 పడకల ఆసుపత్రి నిర్మించలేక పోయారని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాలో సై అంటే సై అన్న పవన్.. నిండా మునిగిన తనకు చలేంటని తేల్చి చెప్పారు. క్లాస్ వార్ అని ఫ్లెక్సీ వేసిన వైసీపీ.. అలాంటి ఫ్లెక్సీ జన సైనికులు వేస్తే, 12 మందిపై కేసులు పెట్టారన్నారు. ఎలాంటి పోరాటం చేసిన పోలీసు కేసులు పెడుతున్నారని.. కానీ, ఒక్క వైసీపీ కార్యకర్తపై కేసు లేదని పవన్ చెప్పుకొచ్చారు.