NTV Telugu Site icon

Pawan Kalyan: వెంకన్నకి అపచారం జరిగితే.. మాట్లాడకుండా ఎలా ఉంటాం..

Pawan

Pawan

Pawan Kalyan: తిరుపతిలో వారహి డిక్లరేషన్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంద రోజుల్లో ఎప్పుడు రోడ్డు మీదకు రాలేదు‌.. సంక్షేమం, అభివృద్ధి ఇచ్చి హామీలను నిలబెట్టు కోవడానికి కూటమీ ప్రభుత్వం పని చేసింది.. పగ, ప్రతీకార రాజకీయాలుండవని గెలవగానే చెప్పామన్నారు. పది సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు తిట్టారు‌.. అనేక రకాలుగా దూషించారు‌.. అయినా ఎప్పుడు బాధ పడలేదు‌.. కానీ వేంకటేశ్వర స్వామి మీదకే వస్తే ఎందుకు ఊరుకుంటాం.. అన్నీ రాజకీయాలేనా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా అని ఆయన మండిపడ్డారు. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని కోరుకున్నా.. వైసీపీ నేతలే ఈ పరిస్థితిని తీసుకొచ్చారు.. నాకు అన్యాయం జరిగిందని నేు బయటకు రాలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: PM Modi: కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం.. ప్రధాని మోడీ ఫైర్..

ఇక, కల్తీ ప్రసాదాలు పెట్టారు.. వెంకన్న స్వామికి అపచారం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సనాతన ధర్మానికి అపచారం చేస్తూనే వచ్చారు.. భరించాం.. భగవంతుడు వారిని 11 సీట్లకు కుదించినా బుద్ధిరాలేదు.. సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రిగానో, జనసేన అధ్యక్షుడిగానో నేను ఇక్కడికి రాలేదు.. భారతీయుడిగా హైందవ ధర్మాన్ని పాటించేవాడిగా మీ ముందుకొచ్చాను.. హిందుత్వాన్ని పాటిస్తా.. ఇస్లాం, సిక్కుయిజం, బుద్దియిజం, క్రిస్టియన్ సహా ఇతర అన్ని మతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు‌‌. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మం అని ఉప ముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు.

Read Also: DGP Atul Verma: డీజీపీ సంచలన నిర్ణయం.. తక్కువ మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడితే నేరం కాదు!

అలాగే, ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగింది.. ప్రాయశ్చిత దీక్ష చేపడితే దాన్ని అపహాస్యం చేశారు అని డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వారికి పాపంలా కనిపిస్తోంది.. సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను.. దాని కోసం నా జీవితం, రాజకీయ జీవితం పోయినా బాధపడను.. నేను ఎప్పుడూ ధర్మం తప్పలేదు అని ఆయన చెప్పారు. నా కూతురితో దర్శనానికి వెళుతూ డిక్లరేషన్ ఇప్పించా.. పరాజయం ఎదురైనా, పరాభవం ఎదురైనా ఇలా ఉండటానికి కారణం సనాతన ధర్మమే.. సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని కొందరు అంటున్నారు.. రామాయణం కల్పవృక్షం కాదు.. విషవృక్షం అన్నారు.. కొంతకాలంగా కల్తీనెయ్యి, జంతువు కొవ్వు కలిపిన ప్రసాదాలు స్వామికి పెట్టారు.. కల్తీనెయ్యితో చేసిన లడ్డూలే అయోధ్య రామయ్యకు పంపారు అని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.