NTV Telugu Site icon

Pawan Kalyan: జనసేనకి అధికారం కట్టబెట్టండి.. నచ్చకపోతే నేనే రాజీనామా చేస్తా

Pawan Kalyan Requests Power

Pawan Kalyan Requests Power

Pawan Kalyan Requests People To Give Power To His Janasena Party In Next Elections: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడలో ఉన్న విషయం తెలిసిందే! తన వారాహి యాత్రలో భాగంగా.. ఆయన చెబ్రోలులో పట్టు రైతులు, చేనేత కళాకారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కుల రాజకీయాలకు తాము స్వస్తి చెప్తామని హామీ ఇచ్చారు. సమస్యలు చెప్తున్నారే తప్ప, ఎన్నికల సమయంలో మాత్రం అధికారులు వదిలేస్తున్నారని విమర్శించారు. ఉప్పాడ నేతలకి గిట్టుబాటు కూడా రాకపోవడం తనని కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలలో తాను చేనేత కుటుంబాల మధ్య పెరిగానని.. దశాబ్దాలుగా పట్టు రైతులు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు.

Park Soo Ryun: మెట్లపై నుండి పడి.. కొరియన్ నటి మృతి

తాను దౌర్భాగ్యులతో సరదాగా మాటలు అనిపించుకోవడం లేదని, ఒక ఆవేదనతో పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీఎం లాగా తాను తన కులానికి చెందిన వారికి 85 శాతం పదవులు ఇవ్వనని.. సీఎం లాగా నోటికి ఏది వస్తే అది మాట్లాడననని.. చేసేదే చెప్తానని అన్నారు. తన కులం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. మీరు మోసగాళ్ల మాటలు నమ్మొద్దని ప్రజల్ని సూచించారు. తాము వస్తుంటే.. వెంటనే డబ్బులు వేస్తా, సమావేశాలు ఆపేయాలని అడ్డుపడుతున్నారని చెప్పారు. నిజాయితీపరులంటే, ప్రభుత్వానికి చాలా భయమంటూ చురకలంటించారు. పదేళ్ల నుంచి అధికారం లేకపోయినా.. రోడ్ల మీద తిరిగి, ప్రజా సమస్యల్ని తాము పరిష్కరిస్తున్నామన్నారు. జీఎస్టీ వెసులుబాటు గురించి కేంద్రంతో మాట్లాడుతానని.. స్వార్ధంలేని రాజకీయాలను మీరు నమ్మాలని చెప్పారు.

Tammanah: ఆ బోల్డ్ సీన్స్ ఏంటి.. ఆ బూతులు ఏంటి.. అసలు నువ్వు మా తమన్నావేనా..?

ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించాలని.. దేశం మొత్తం చూసేలా పిఠాపురంని తయారు చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. పదేళ్లు జనసేనకి అధికారాన్ని కట్టబెట్టాలని రిక్వెస్ట్ చేశారు. ఒకవేళ తన అధికారం నచ్చకపోతే.. రెండేళ్లలో తానే రాజీనామా చేస్తానన్నారు. ప్రలోభాలు దాటి జనసేనను గెలిపించాలన్నారు. దళితులు నా మేనమామ అన్నవాడు అంబేద్కర్ విదేశీ విద్య తీసేసాడన్నారు. జనసేన ప్రజా ప్రతినిధులను అసెంబ్లీకి పంపించాలని, వచ్చే ఎన్నికల్లో మోసగాళ్ళ మాటలు నమ్మకండని హితవు పలికారు. అమ్మ ఒడి ఇచ్చి, నాన్న జేబు ద్వారా డబ్బులు లాగేసుకుంటున్నారని పవన్ విమర్శించారు.

Show comments