Site icon NTV Telugu

Pawan Kalyan: భీమవరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి

Pawan Kalyan Bhimavaram Tour

Pawan Kalyan Bhimavaram Tour

Pawan Kalyan Bhimavaram Visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణి-జనసేన భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. భీమవరం రాగానే డంపింగ్ యార్డ్ సమస్య ఏమైందని అడిగితే అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉందని తెలిసిందని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో త‌న‌ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన నేత‌లు.. సమస్యల పరిష్కారానికి ఎందుకు పనిచేయడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Read Also: Pawan Kalyan Live: భీమవరంలో జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం

కాగా ప్రజావాణి కార్యక్రమంలో దివ్యాంగ దంపతులు కూడా పాల్గొని పవన్‌కు అర్జీని సమర్పించారు. తాము పడుతున్న బాధలకు చలించి రెండు వీల్ చెయిర్స్, నగదు ఇస్తామని పవన్ చెప్పారని దివ్యాంగ దంపతులు తెలియజేశారు. అంతకుముందు భీమవరం చేరుకోగానే పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.

Exit mobile version