Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Meets Mohan Yadav: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భేటీ అయ్యారు. జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్.. మోహన్ యాదవ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేసే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. అలాగే నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అడవి దున్నలను తిరిగి ప్రవేశపెట్టేందుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ కోరారు. అటవీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఉందనే అంశంపై ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
ఈ సందర్భంగా త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మరింత చర్చించే అవకాశం ఉంది. సమావేశం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక బహుమతులు అందజేశారు. సంప్రదాయానికి ప్రతీకగా ఉప్పాడ పట్టు శాలువా, ఆంధ్రప్రదేశ్ కళా వైభవాన్ని చాటిచెప్పే కొండపల్లి కళాకృతిని బహూకరించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!