NTV Telugu Site icon

Velampalli Srinivas: సనాతన ధర్మం గతంలో లేనట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు..

Vellampalli

Vellampalli

Velampalli Srinivas: ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు.. తప్పు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయలేదు? అని ప్రశ్నించారు. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు.. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రే ఆరోపణలు చేశాక.. ఇక సిట్ దర్యాప్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు. ఏఆర్ ఫుడ్స్ నిజంగానే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గతంలో లేనట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.. చెప్పులు వేసుకుని దీక్షలు చేయటం పవన్ కళ్యాణ్ కే చెల్లింది.. ఇలాంటి దారుణాలను మేము ఎప్పుడూ చూడలేదని వెల్లంపల్లి అన్నారు.

Read Also: Sai Durgha Tej : మరో సారి తన మంచి మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్.. పిల్లల కోసం విరాళం

ఇక, మాటలు చెప్పే ముందు సనాతన ధర్మాన్ని పవన్ పాటించాలి అని మాజీమంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన రెండు నెలల వరకూ దాన్ని ఎందుకు బయట పెట్టలేదు? అని అడిగారు. ఆ రిపోర్టు గురించి టీడీపీ ఆఫీసులో మాట్లాడటం ఏంటి?.. వనస్పతి కలిసిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపామని ఈవో శ్యామలరావు జులై 23వ తేదీన చెప్పారు.. జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి మీటింగ్ లో మాట్లాడారు.. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు అని ఆయన అన్నారు. కానీ వనస్పతి కలిసిన ట్యాంకర్లను వెనక్కు పంపామని సెప్టెంబరు 20న ఈవో శ్యామలరావు చెప్పారు.. మళ్ళీ చంద్రబాబు సెప్టెంబరు 22న మాట్లాడుతూ ఆ నెయ్యిని వాడారని మరోసారి అబద్దాలు చెప్పారు అని శ్రీనివాసరావు వెల్లడించారు.

Read Also: Road Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. తొమ్మిది మంది మృతి!

కాగా, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రా? టీటీడీ ఈవోనా? అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకం చంద్రబాబు.. హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుది.. సూపర్ సిక్స్ పథకాల నుండి డైవర్షన్ కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు.. లడ్డూ విషయమై సుప్రీంకోర్టు విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. చేసిన తప్పును ఒప్పుకుంటూ చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి..చంద్రబాబూ నీ తప్పు ఒప్పుకో.. లేకపోతే వెంకటేశ్వర స్వామి ఒప్పుకోడు.. వరదల మేనేజ్మెంట్ ‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు.. వరద సహాయం పేరుతో చంద్రబాబు వందల కోట్లు వసూలు చేశారు.. అందులో 10 శాతం ఖర్చు పెట్టినా బాధితులను అదుకోవొచ్చన్నారు. వరద బాధితులపై లాఠీ ఛార్జి చేసిన ఘనత చంద్రబాబుది.. సాయం చేయమని కోరితే దాడులు చేస్తారమని ప్రశ్నించారు. పరిహారం ఎగ్గొట్టడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. వీటన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహించాలి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.