NTV Telugu Site icon

Pawan Kalyan: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

Pawan Prakas

Pawan Prakas

పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో గత మూడేళ్లలో 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదు. కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవని అందరికీ తెలుసు.. ఒక్క సీఎం జగన్ కు తప్ప. మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోలేదు.

అధికారంలోకి రావటానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. ఫాదర్స్ డే రోజున రైతుల పిల్లలకు న్యాయం జరగాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు.. కన్నీరు తుడిచే గుండె చాలు. సీఎంతో సహా వైసీపీ నేతలు ఏపీలో ఏమైనా మాట్లాడొచ్చు. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారన్నారు. నేను ఏమైనా మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. పాలసీ ప్రకారం మాట్లాడితే మేము రెడీ.

డబ్బు మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఏదైనా మాట్లాడితే దత్త పుత్రుడు అంటూ మాట్లాడుతున్నారు. న్యాయం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలి.. అందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఎమ్మెల్యేలకు కూడా డబ్బు మదం ఎక్కింది. అవకాశాలు లేక ప్రకాశం జిల్లా నుండి వలసలు పెరిగాయి. వెలిగొండ ప్రాజెక్టు ఇంత వరకూ పూర్తికాక పోయినా అడిగే నాయకులు ఉండరన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ పరామర్శ

ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళలేదు. పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలు చేసి.. ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారు. నేను ఎవరికీ దత్త పుత్రుడిని కాదు.. ప్రజలకు మాత్రమే దత్త పుత్రుడిని. మీరు సీబీఐ దత్త పుత్రుడు అంటే సహించలేరు. వివేకానందరెడ్డి మృతిపై ఇంత వరకు స్పష్టత లేదు. ఉద్యోగానికి వెళ్ళాలన్నా కేసులు ఉంటే రావు.. మరి ఎమ్మెల్యేలకు ఇవి వర్తించవా?

కొన్ని భావజాలాలను నమ్ముకున్నా కాబట్టే సొంత పార్టీ పెట్టా. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలను రీకాల్ చేసే అధికారం ఉంటే వీరు తప్పులు చేస్తారా. దశాబ్దాలు కష్టపడాలనే రాజకీయాల్లోకి వచ్చా. ముఖ్యమంత్రి కావాలని రాలేదన్నారు పవన్. తప్పు చేస్తే ముఖ్యమంత్రిని అయినా చొక్కా పట్టుకుని నిలదీసే కార్యకర్తలను తయారు చేసేందుకు వచ్చానన్నారు.

రైతులు వ్యవసాయం గిట్టుబాటు లేక క్రాప్ హాలీడే ప్రకటిస్తున్నారు. రైతులు ఇబ్బందుల వల్ల క్రాప్ హాలీడే ప్రకటిస్తుంటే మేము రెచ్చగొడుతున్నామంటున్నారు. వాళ్ళు చేసిన ఐదు లక్షల కోట్లలో లక్ష కోట్లు మినహా మిగతా డబ్బు ఏమైందని ప్రశ్నించాలి? ఏ జిల్లాకు ఎంత ఇచ్చారో చెప్పేవారు లేరు. ఏమైనా మాట్లాడితే వైసీపీ వాళ్ళు బూతులు తిడుతున్నారు.. ఇది సమంజసమా?ప్రశ్నిస్తే కేసులు పెట్టించే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

ప్యాంటు విప్పి అరాచకం.. ఘాటు అందాలను ఎరగా వేసి మరీ చూపిస్తుందే