రాజకీయాల నుంచి క్రిమినల్స్‌ను తీసివేయాలన్నది మా లక్ష్యం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వైజాగ్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఆయన.. ఆ తర్వాత మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. అక్కడ మీడియాతో మాట్లాడిన పవన్.. తన వైజాగ్ పర్యటనపై ఘాటుగా స్పందించారు.. వైసీపీకి పోటీగా కార్యక్రమం పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేసిన పవన్.. మేం నిర్మాణాత్మకంగానే మా విమర్శలు ఉంటాయి.. ఒక రాజకీయ పార్టీగా అది మా బాధ్యత.. మా అంతర్గత కార్యక్రమాలను వైసీపీకి ఎలా చెబుతాం అని ప్రశ్నించారు. విశాఖ గర్జనకు మూడు రోజుల ముందే మేం టికెట్లు బుక్ చేసుకున్నామన్న ఆయన.. మేం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడబోమన్నారు.. మూడు రాజధానుల అంశాన్ని మర్చిపోతారనే ఈ గొడవలు సృష్టించారని ఫైర్ అయ్యారు.. ప్రజలు పాలన చేయమంటే మీరు గొడవలు సృష్టిస్తారేంటి..? అని నిలదీశారు.
Read Also: Divya- Arnav Case: సీరియల్ నటి దివ్య కేసులో ఊహించని ట్విస్ట్.. ట్రాన్స్ జెండర్ ను పెళ్లాడిన భర్త
కులాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు? అని ప్రశ్నించారు పవన్.. కమ్మ ,కాపు ,రెడ్డి అంటూ కులాల మధ్య కుంపట్లు పెట్టొద్దు అని విజ్ఞప్తి చేశారు. రైతుల పాదయాత్ర అడ్డుకోవడానికి మీకేం హక్కు ఉంది…? ఉత్తరాంధ్ర పై నిజంగా ప్రేమ ఉంటే మీరు చేస్తున్న భూకబ్జాలు ఆపండి అని వ్యాఖ్యానించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధికంగా ముఖ్యమంత్రులు వచ్చారు… అక్కడ కూడా అభివృద్ధి చేయలేకపోయారు… కులం ,మతం పేరుతో కొట్టుకుంటూ పోతే అభివృద్ధి జరగదు అని హితవుపలికారు.. కోట్లాదిమంది అభిమానులు ఉన్న నన్ను ఓ ఐపీఎస్ అధికారి బెదిరించాడంటే, ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.. వైసీపీ నాయకులు ఎన్ని దొంగ కేసులు పెట్టినా న్యాయవ్యవస్థ ప్రజలకు అండగా నిలబడింది.. ఏపీ న్యాయవ్యవస్థకు నా ధన్యవాదాలు.. ఏపీలో జరుగుతున్న పరిస్థితులను న్యాయవ్యవస్థ గమనించాలి.. రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
నన్ను రెచ్చగొట్టి అరెస్ట్ చేద్దామన్న వ్యూహంతో కొంతమంది పోలీసులు వ్యవహరించారు… పోలీసులని ధిక్కరించే శక్తి నాకు లేదు.. కోట్లాదిమంది అభిమానులు ఉన్న నేను సగటు మానవుడినే… కానీ, రౌడీ రాజకీయాలను నేను సహించలేను అన్నారు పవన్ కల్యాణ్.. చట్టాలను గౌరవించడమే నాకు తెలుసు.. రాజకీయాలనుండి నేరచరిత్రను దూరం చేయాలనేదే నా ఆలోచనన్న ఆయన.. ఏ నేరం చేయని మా జన సైనికులను అరెస్ట్ చేశారు … ఇప్పటికీ 14 మంది జైల్లో ఉన్నారు… జైళ్లలో కూడా మా జన సైనికులను వేధిస్తున్నట్లు తెలిసిందన్నారు.. నోరు జారే ప్రతి వైసీపీ నాయకుడు భవిష్యత్ లో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు వప్.. వైసీపీ నేతల నోటికి అడ్డూ అదుపు ఉండడని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.. ఇంట్లో వాళ్లను తిట్టినట్టు తిట్టడం, భయ పెట్టేలా ప్రయత్నం చేయటం వారి పని…. అయినా మీ ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు మేం భయపడం అని హెచ్చరించారు. అయినా, ప్రభుత్వంలో ఉండి గర్జిస్తారా? అధికారానికి దూరంగా ఉన్న వారు గర్జిస్తారు.. మేం కార్యక్రమం పెట్టుకున్న రోజే గర్జన చేస్తామని ప్రకటించారు.. అంత దిగజారుడు తనం మాకు లేదన్నారు పవన్.. వైసీపీ వాళ్ల కార్యక్రమం ఫెయిల్ అయ్యింది.. మాకు వచ్చిన స్పందన చూడలేకే ఈ దాడి డ్రామా ఆడారని ఆరోపించారు పవన్.. అసలు పోలీసులు ఏమయ్యారు? అని ప్రశ్నించిన ఆయన.. కోడి కత్తికి సమాధానం లేనట్లే దీనికి సమాధానం ఉండదని ఎద్దేవా చేశారు. జనసైనికులను వాళ్లే రెచ్చగొట్టి ఉంటారని ఆరోపించిన పవన్.. 107 మందిపై కేసులు పెట్టారు.. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదన్నారు పవన్ కల్యాణ్.
