Pawan Kalyan Comments on YSRCP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. బాలయోగి తర్వాత కోనసీమ అభివృద్దిని పట్టించుకున్న నాయకుడు లేడని పేర్కొన్న ఆయన కోనసీమకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లేదు, ఏదైనా ప్రమాదం జరిగితే కాకినాడకు వెళ్లాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డాను అంటే అది మీ బలం అని, కోనసీమ ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. ముమ్మిడివరం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డాను అంటే మీ బలం అని అన్నారు. ఇక కోనసీమ ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుందన్న ఆయన కోపం వస్తే బ్లూ అవుట్ లా మండి పోతారు ప్రేమ ఆ స్థాయిలోనే ఉంటుందని, అందుకే ఈ ప్రాంతానికి రావాలంటే భయం అని అన్నారు.
APSRTC: వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 294 మందికి ఉద్యోగావకాశం!
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుకు జనసేన మద్దతు పలికిందని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయని, విభేదాలు వచ్చినప్పుడు సమస్య సామరస్యంగా పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి రెండు వర్గాల మధ్య కుల చిచ్చు పెట్టారని అన్నారు. ఎమ్మెల్యేలను కుల సంఘాల నేతల వద్దకు పంపి పరిష్కరించలేదని ఆయన అన్నారు. ఇక వైసీపీకి నేను వ్యతిరేకం కాదన్న పవన్ తాను వైసీపీ నేతల వైఖరికే వ్యతిరేకం అని అన్నారు. ద్వారంపూడి కుటుంబికులు కోనసీమ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని అంటూ ద్వారంపూడిపై మరోసారి పవన్ ఫైర్ అయ్యారు. కష్టాల్లో ఉన్న కోనసీమ రైతులను ఆదుకోవడం మాని కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని, వైసిపి గుండాల బెదిరింపులకు భయపడం అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే రైతులకు కన్నీళ్లు మిగిల్చారని, జనసేన గెలిస్తే కన్నీళ్లు ఉండేవి కావని అన్నారు.