అనంతపురం జిల్లా మన్నీల రచ్చబండ లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రైతు నేపథ్యం నుంచి వచ్చా… రైతు కష్టం తెలిసిన వాడిని.కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లేక… గిట్టుబాటు కాక నిరాశ నిస్పృహ లో ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి… లక్షల కోట్లు ఉంటే ఏమి లాభం? కౌలు రైతు, రైతులకు కులం ఉండదు. ఒకప్పుడు నేను ఇంటర్ లో బాగా చదువు కోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా.
సోదరుడు నాగబాబు, మా వదిన మంచి మాటలు చెప్పి మార్చారు. ఇవాళ మొదటి విడతలో 30 కుటుంబాలకు ఇచ్చాం. మరో రెండు విడతల్లో మిగిలిన రైతులకు సాయం అందిస్తాం. డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోం .ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇస్తాం. చనిపోయిన కౌలు రైతుల సహాయం కోసం నిధిని ఏర్పాటు చేస్తాం అన్నారు పవన్. రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు చనిపోయారన్న జాబితా ప్రభుత్వం వద్ద లేదు జనసేన వద్ద లిస్ట్ ఉంది.
వైసీపీ నాయకత్వం నాపై వ్యక్తి గత దూషణలు చేస్తున్నారు.. నేను భరిస్తున్నాను. వైసీపీ నేతలు నన్ను సీబీఎన్ దత్తపుత్రుడు అంటున్నారు. మీరు సీబీఐ దత్తపుత్రులు.మీ మంత్రులు కాదా? నేను మాట్లాడితే టీడీపీ బీ టీమ్ అంటున్నారు. ఇంకోసారి అంటే నేను చర్లపల్లి షటిల్ టీమ్ అంటాను. వైసీపీ వాళ్ళు స్వతంత్ర సమరయోధులు లాగా మాట్లాడుతారు. నాకు భయం లేదు… దెబ్బ పడేకొద్దీ రాటుతేలుతా. పోలీసు శాఖ పరిస్థితి క్లిష్టంగా ఉంది. సరెండర్ లీవ్, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి చెబుతున్నాను. పోలీసులకి ఇవ్వాల్సినవి ఇవ్వండి.
ప్రభుత్వం చేత ముక్కు పిండించి మరీ కౌలు రైతు కుటుంబాని కి రూ.7 లక్షలు ఇప్పించేందుకు వత్తిడి తెస్తాం. ప్రతి కుటుంబానికి డబ్భు, కౌలుదారు గుర్తింపు కార్డులు వచ్చే వరకు అండగా ఉంటాం. జన సైనికులు రైతు కుటుంబాలకు అండగా ఉండండి అన్నారు పవన్ కళ్యాణ్.