Murder: ఏపీలో పరువు హత్య.. వేటకొడవళ్లతో నరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కుల జాఢ్యం ఇంకా వేధిస్తూనే ఉంది.. కులం మత్తులో ఇంకా కొంతమంది ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లికి చెందిన గొల్ల నరేంద్ర.. అదే గ్రామంలోని బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోడంతో.. వారిని ఎదిరించి రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుని కోనేపల్లిలో నివాసం ఉంటున్నారు.. వారికి ఒక కుమార్తె కూడా ఉంది..
Read Also: Gas Price Hiked: వంట గ్యాస్‌పై వడ్డింపు.. రూ.50 పెంచిన చమురు సంస్థలు
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
అయితే, కుతాంతర వివాహం చేసుకున్న నరేంద్రపై కక్ష గట్టిన యువతి బంధువులు అవకాశం కోసం ఎదురుచూశారు.. రెండేళ్లు గడవడంతో నరేంద్ర ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారి వెంకటాంపల్లికి వెళ్లాడు నరేంద్ర.. అక్కడ, ట్రాక్టర్ రిపేర్ చేస్తుండగా నరేంద్రపై దాడి చేశారు.. వేట కొడవళ్లతో నరికి చంపారు యువతి బంధువులు.. ఇక, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..