Site icon NTV Telugu

YS Jagan: కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా..? ఎందుకీ కక్ష..?

Jagan

Jagan

YS Jagan: మా పార్టీలో ‘కమ్మ’ కులస్తులపై ఎందుకీ కక్ష..?.. కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా? అని సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలను నిలదీశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళలో పర్యటించిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏం పాపం చేశారని మా పార్టీలోని కాపు నేతలను ఇబ్బంది పెడుతున్నారు..? అని మండిపడ్డారు.. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇన్ని రోజులు‌జైల్లో పెట్టారు.. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో జైలుకు పంపిస్తున్నారు.. ఏం పాపం చేశారని కొడాలి నానిని హెరాస్ చేస్తున్నారు.. దెందులూరు కు చెందిన అబ్బయ్యచౌదరిపై తొమ్మిది కేసులు పెట్టారు.. దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గంవాడని కేసులమీద కేసులుపెట్టి హింసిస్తున్నారు.. తలశిల రఘురాం ఎమ్మెల్సీ పై ఏం చేశారని మూడు కేసులు పెట్టారు.. ఎంవీవీ సత్యనారాయణ మాజీ ఎంపీని వ్యాపారాలు చేసే అవకాశం లెకుండా చేశారు.. నంబూరు శంకరరావు మాజీ ఎమ్మెల్యే పై తప్పుడు కేసులు పెట్టారు.. బొల్లా బ్రహ్మనాయుడు, శివకుమార్ పై తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు వైఎస్‌ జగన్..

Read Also: TGSRTC: ఆర్టీసీ తొలి మ‌హిళా కండ‌క్టర్లు వీరే.. 28 ఏళ్ల ఉత్తమ స‌ర్వీసుకు సన్మానం..!

శివకుమార్ కాలేజీకి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు.. పోసాని మా పార్టీ సానుభూతి పరుడని నెలరోజులు జైల్లో పెట్టారు.. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ కు చెందిన భూమిని వెనక్కి తీసుకున్నారని విమర్శించారు వైఎస్‌ జగన్.. మంగళగిరికి చెందిన రాజ్ కుమార్ కమ్మ, పాలేటి కృష్ణవేణిని పెళ్ళి చేసుకున్నాడు.. రాజ్ కుమార్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు.. ఇంటూరు రవికిరణ్ పై పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు అని మండిపడ్డారు.. కమ్మవారంటే నీకు ఊడిగం చెయ్యాలా? మీరు దోచుకునేందుకు… మీ అన్యాయాలను వేలెత్తి చూపిస్తే వేధిస్తారా? చంద్రబాబు ను వ్యతిరేకిస్తే వేధింపులే.. ఒక్కటే చెబుతున్నా.. రేపు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, రాష్ట్రంలో జరుగుతున్నవాటిపై మాట్లాడుతా.. చంద్రబాబు, వారికి వత్తాసు పలుకుతున్న వారికి చెబుతున్నా.. రేపు మా ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తా.. మీరు తప్పుల్లో భాగస్వామ్యం కావవద్దు.. మిమ్మల్నికూడా బోనెక్కుస్తా.. నాగమల్లేశ్వరావు తండ్రి వెంకటేశ్వర్లు కేసుపెట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని వ్యాఖ్యానించారు మాజీ సీఎం వైఎస్ జగన్..

Exit mobile version