Crime News: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువలో ఒక ప్రేమజంట దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాచర్ల పట్టణానికి చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సాగర్ కుడి కాలువ వద్ద ఉన్న బొంబాయి కంపెనీ వంతెనపై నుంచి ఇద్దరూ కాలువలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. దూకిన కొద్దిసేపటికే శ్రీలక్ష్మి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. కాగా, ప్రియుడు గోవర్ధన్ మాత్రం గల్లంతయ్యాడు. అతడి కోసం గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక, సమాచారం అందుకున్న మాచర్ల రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల నిజమైన కారణాలు ఏంటన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో మాచర్ల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.
Read Also: CM Chandrababu: తాళ్లవలసలో విజృంభించిన డయేరియా.. సీఎం చంద్రబాబు ఆరా..