Woman Swallows Pens: భర్త మీద కోపంతో ఓ భార్య చేసిన పనికి డాక్టర్లు నోర్లువెల్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. భర్త మీద కోసం వస్తే.. ఎవరైనా అరుస్తారు.. తిడతారు.. ఇంకా కోపం ఎక్కువైతే.. కొట్టిన భార్యలు కూడా లేకపోలేదు.. మరికొందరు.. కోపం వస్తే.. ఏ పని చేయకుండా అలా ఉండిపోతారు.. అయితే, భార్యామని మాత్రం.. భర్త మీద కోపంతో.. పెన్నులు మింగేసిందట.. అవి కడుపులో చేరి గడబిడ చేయడంతో.. ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది..
Read Also: Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
పల్నాడు జిల్లాలో వెలుగు చూసిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో ఓ యువతి కడుపులో నుంచి పెన్నులు బయటకు తీశారు వైద్యులు.. నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో ఆస్పత్రికి చేరిన యువతకి.. అనుమాతంలో సిటీ స్కాన్ చేశారు వైద్యులు.. దీంతో, కడుపులో పెన్నులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న పెన్నులు బయటకి తీశారు.. అసలు ఆ యువతి కడుపులోకి పెన్నులు ఎలా వెళ్లాయి..? ఎందుకు పెన్నులను మింగాల్సి వచ్చింది అని ఆరా తీస్తే.. భర్త మీద కోపంతోనే సదరు యువతి పెన్నులు మింగినట్లు సమాచారం..
