తమిళ స్టార్.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు.. సూర్య సేతుపతి రీసెంట్‌గా తన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే.. జూలై 4న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో సూర్య, అభిమానులతో ముఖాముఖి కలుసుకున్న సందర్భంలో, నోట్లో చూయింగ్ గమ్ నములుతూ, చాలామందిని అసహనానికి గురి చేసేలా ప్రవర్తించాడు. ఇక
Also Read : Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా చేరుస్తూ.. నోటీసులు జారీ!
ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. “తండ్రి ఎంతో వినమ్రంగా ఉంటారు.. కానీ కొడుకు బిల్డప్ చూపిస్తున్నారు”, “ఇది నెపోటిజం ఫలితం” అంటూ కామెంట్ల వర్షం కురిసింది. మనకు తెలిసి విజయ్ సేతుపతి అభిమానులతో ఎంతో సాదాసీదాగా, ప్రేమగా వ్యవహరిస్తారు. దీంతో తాజాగా ఈ విమర్శలపై విజయ్ సేతుపతి స్వయంగా స్పందించారు.
‘నా కొడుకు ప్రవర్తన ఎవరైనా తప్పుగా భావిస్తే, దానికి బాధ్యత తీసుకుంటూ క్షమాపణలు చెబుతున్నాను, అతను కావాలనే అలా చేయలేదని, తెలియక జరిగిన తప్పిదం. అతనికి ఇదే మొదటి అనుభవం. ముందు నుంచి నేను నేర్పించాల్సిన విషయాల్లో ఇది ఒకటి. తప్పకుండా సవరించుకుంటాడు. నేను చెబుతాను’ అంటూ విజయ్ వెల్లడించారు. తప్పు జరిగినా, దాన్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పడంలో చిన్నతనమేమీ లేదని మరోసారి నిరూపించారు విజయ్ సేతుపతి. కొడుకు సూర్య కూడా ఈ పరిణామాల నుంచి నేర్చుకొని, తండ్రిలా మర్యాదగా నటనతో పాటు వ్యక్తిత్వంలోనూ ఎదగాలని ఆశిద్దాం.