Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu New Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మళ్లీ షాక్ తగిలింది.. మాజీ మంత్రిపై మరో కేసు నమోదు అయింది. తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే కాగా.. ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా దీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రజా ప్రదేశంలో దీక్ష చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా, నిరాహార దీక్ష కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Read Also: VDxShouryuv : జూనియర్ ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
కాగా, ఇటీవల తన నివాసంపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు దీక్ష చేపట్టగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఇప్పటికే సత్తెనపల్లి లక్కీడ్రా కేసుతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసుల్లో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు 17 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్‌పై విడుదలైన విషయం విదితమే..
తాజావార్తలు
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
-
YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!