పల్నాడు జిల్లాలో చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నం చేశాడు ఓ ఆగంతకుడు.. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో జరిగింది.
Read Also: Barlapudi Kranti: నాన్నగారి ఇంటిపై దాడి జరిగిందని చాలా బాధపడ్డా..
వివరాల్లోకి వెళ్తే.. ఇసుక వాగు ప్రాంతం వద్ద ఆడుకుంటున్న ఓ బాలికకు చాక్లెట్ ఇచ్చి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశాడు దుండగుడు. దీంతో చాక్లెట్ కోసమని బాలిక ఆ యువకుడు దగ్గరికి వెళ్లింది. ఈ లోపు బాలికను అపహరిస్తున్నాడన్న అనుమానం అక్కడున్న స్థానికులకు వచ్చింది. దీంతో ఆగంతకుడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అనంతరం.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దుండగుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.
అయితే పోలీసుల సహకారం, స్థానికుల సమయస్ఫూర్తితో తమ బిడ్డకు ఎలాంటి ఆపద రాకుండా బయటపడిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్‌కు ప్రయత్నించిన వ్యక్తి దగ్గర నుండి బాలికను రక్షించిన పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా బయటకు ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలను.. తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు సలహా ఇచ్చారు.