Ambati Rambabu: జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. ఆయన పర్యటనకు అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.. జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోం అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొదిలి పర్యటనలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్ళారు.. అక్కడ నలుగురు మహిళల్ని పెట్టీ నల్ల బెలూన్లతో జగన్ కి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.. వాళ్ళే రాళ్ళు వేసి మావాళ్ళ మీద కేసులు పెట్టారు అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Read Also: Minister Seethakka: కేటీఆర్ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు.. మంత్రి ఆసక్తికర వాఖ్యలు..!
అయితే, పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ వెళ్తున్నారంటే అనేక మంది అనుసరిస్తారు.. వైఎస్సార్ బిడ్డగా జగన్ కోసం జనం వస్తారు.. పార్టీ కార్యకర్త మృతి చెందారు.. కాబట్టే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శకు వెళ్తున్నారు.. ఇక, జగన్ బయటకు వస్తున్నాడంటే చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. మేం ఇన్ని పర్యటనలకు వెళ్ళాం.. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలు భగ్నం చేయాలనే కుట్రలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Read Also: Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా కేంద్ర ప్రభుత్వం.. మంత్రి హాట్ కామెంట్స్..!
మిస్టర్ లోకేష్, మిస్టర్ చంద్రబాబు అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఓ పక్క కేసులు పెడతారు.. మాపైనే దాడులు చేస్తారు.. ప్రజాస్వామ్యంలో ఎన్నాళ్లు సాగుతుందో మేము చూస్తామని అన్నారు. మీరు చేసిన వాగ్దాన భంగాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం.. మీరు ఎన్నాళ్లు అనిచి వేస్తారో మేము చూస్తామని తెలిపారు. జగన్ కు ప్రజల్లో జనాదరణ పెరుగుతుంది.. ఇప్పటి వరకు చంద్రబాబు వెన్నుపోటు మంచితనాలు చాలా చూశాం.. భయపడితే రాజకీయాలు చేయలేం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
