Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Palla Srinivasa Warning To Ycp

Palla Srinivasa: వైసీపీకి వార్నింగ్.. దౌర్జన్యం చేస్తే, రౌడీల్లా వ్యవహరిస్తాం

Published Date :October 15, 2022 , 11:59 am
By NTV WebDesk
Palla Srinivasa: వైసీపీకి వార్నింగ్.. దౌర్జన్యం చేస్తే, రౌడీల్లా వ్యవహరిస్తాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Palla Srinivasa Warning To YCP: టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్ అధికార పార్టీ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ దౌర్జన్యం చేస్తే.. తాము కూడా రౌడీల్లా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై ఆర్ధిక ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. దసపల్లా భూములు, హయగ్రీవ భూముల దొపిడీని అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు. విజయసాయి, విశాఖ ఎంపీకి మధ్య వాటాల్లో తేడా వచ్చిందని.. అధికార పార్టీ నేతలే తమ అవినీతిని బయట పెట్టుకుంటున్న పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్ కుట్రలో భాగంగానే.. ఏపీలో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఋషికొండ మీదున్న ప్రభుత్వ రిసార్ట్సును కూల్చేశారని మండిపడ్డ పల్లా శ్రీనివాస్.. ఆ కొండకి సమీపంలో విజయసాయి, జగన్ రాడిసన్ బ్లూ, బే పార్క్ రిసార్ట్స్ కట్టుకున్నారని అన్నారు. తమ రిసార్ట్స్‌కు వ్యాపారం పెంచుకోవడం కోసమే ప్రభుత్వ రిసార్ట్స్‌ను కూల్చారని.. రాజధాని కోసం కాదన్నారు. సీఎం సతీమణికి అక్కడ వ్యూ నచ్చడం వల్ల, అక్కడ క్యాంప్ ఆఫీస్ కడుతున్నారని ఏదేదో చెప్తూ.. ఋషికొండను బోడి కొండ చేశారన్నారు. సీఎం ఇల్లు కట్టుకోవాలంటే.. 80 అడుగుల మీదున్న కొండే కావాలా..? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో పులివెందుల పంచాయతీ కుదరదని.. ఉత్తరాంధ్ర విప్లవ పోరుగడ్డ అని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. వికేంద్రీకరణకు మద్దతు ఇస్తూ, శనివారం జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జేఏసీ నాయకులు సహా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇందులో పాల్గొన్నారు. మూడు రాజధానుల నినాదం మారుమోగుతున్న ఈ ర్యాలీలో సాంస్కృతిక ప్రదర్శనల్ని సైతం నిర్వహించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Palla Srinivasa
  • vijayasai reddy
  • visakha garjana
  • YS Jagan Mohan Reddy
  • YSR Congress Party

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions