NTV Telugu Site icon

Minister TG Bharath: త్వరలోనే ఓర్వకల్లు అతిపెద్ద పారిశ్రామిక హబ్గా ఏర్పడుతుంది..

Tg

Tg

Minister TG Bharath: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన పరిశ్రమను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పూర్తవ్వలేదు అన్నారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను త్వరగా పూర్తి చేసి స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

Read Also: Hyderabad: బిగ్‌ అలెర్ట్‌.. 4 రోజులు ఫ్లైఓవర్ ​బంద్..! ఎక్కడంటే..

ఇక, ఓర్వకల్లు మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పెట్టుబడుదారులకు అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. పరిశ్రమలకు కావాల్సిన రైల్వే లైన్, నీటి వసతి, రోడ్డు నిర్మాణాలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే ఓర్వకల్లు అతి పెద్ద పారిశ్రామిక హబ్ గా ఏర్పడుతుంది.. పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాలు వస్తాయి.. అలాగే, పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి భారత్ తో పాటు ఎమ్మెల్యే గౌరు చరితా, అధికారులు, తదితరలు పాల్గొన్నారు.