శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్దాపన సమయంలో సభా వేదికపై మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డిలు ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి రూ. 215 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. అయితే ఈ కార్యక్రమంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా సభ వేదికగా మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు.
Also Read: Nabhi Marma Benefits: చలికాలంలో శరీరం వెచ్చదనం కోసం ‘నాభి మర్మం’.. అంటే ఏంటో తెలుసా?
మంత్రి, ఎమ్మెల్యేలు మధ్య జరిగిన మాటల దాడికి అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు సత్రాలు, వీఐపీ కాటేజుల డిపాజిట్ల అంశమై మాట్లాడుతుండా వారిమధ్య వివాదం తలెత్తింది. నిర్మాణ సమయంలో 50 లక్షలు డిపాజిట్ చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ నిర్ణయించగా.. 50 లక్షల డిపాజిట్ వీలుకాదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మంత్రిపై బహిరంగ సభలో వాదోపవాదాలకు దిగారు. దీంతో కాటేజీల విషయమై మరోసారి ముఖ్యమంత్రి వద్ద చర్చిద్దామని సభలో మంత్రి సత్యనారాయణ తెలిపారు. దీంతో చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లడం ఏంటనీ, దీనికి తాను ఒప్పుకోనని ఎమ్మెల్యే చక్రపాణి సభలోనే తేల్చి చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.