శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్దాపన సమయంలో సభా వేదికపై మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డిలు ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి రూ. 215 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. అయితే…