NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో వర్షాలు.. అరుదైన రికార్డు నమోదు..!

Rainfall

Rainfall

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఈ సారి వర్షాలు అరుదైన రికార్డు నమోదు చేశాయి.. గత 10 సంవత్సరాలలో మార్చిలో కురిసిన వర్షాల్లో ఈసారి మార్చి కూడా ఒకటిగా నిలిచింది.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 300 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అందులో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 870 శాతం వర్షపాతం నమోదైంది. తిరుపతి మరియు విశాఖపట్నం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ఏపీలో మార్చిలో 10-20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది.. కానీ, ఈసారి చాలా ఎక్కువగా అంటే 60-70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. ఇది చాలా అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..

Read Also: AP Half Day Schools: నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఆ స్కూళ్లకు మాత్రం సెలవులు..

ఇక, ఇదే సమయంలో.. కోనసీమ జిల్లాలో 733 శాతం, విశాఖపట్నంలో 623 శాతం, శ్రీకాకుళంలో 429 శాతం, అనకాపల్లిలో 439 శాతం, కాకినాడలో 523 శాతం, కృష్ణా జిల్లాలో 564 శాతం, నెల్లూరులో 553 శాతం, కడపలో 646 శాతం, తిరుపతిలో 671 శాతం, అన్నమయ్య జిల్లాలో 386 శాతం, ఏలూరులో 353 శాతం వర్షపాతం మార్చి నెలలో నమోదు అయ్యింది.. అత్యల్పంగా అంటే ప్రకాశం జిల్లాలో 6 శాతం మాత్రమే నమోదైంది.. కర్నూలులో 16 శాతం, అనంతపురం 35 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 110 శాతం, నంద్యాల 123 శాతంలో వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా, మార్చిలో కురిసిన అకాల వర్షాలతో భారీ పంట నష్టం జరిగిన విషయం విదితమే..