Andhra Pradesh: ఏపీలో వర్షాలు.. అరుదైన రికార్డు నమోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఈ సారి వర్షాలు అరుదైన రికార్డు నమోదు చేశాయి.. గత 10 సంవత్సరాలలో మార్చిలో కురిసిన వర్షాల్లో ఈసారి మార్చి కూడా ఒకటిగా నిలిచింది.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 300 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అందులో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 870 శాతం వర్షపాతం నమోదైంది. తిరుపతి మరియు విశాఖపట్నం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ఏపీలో మార్చిలో 10-20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది.. కానీ, ఈసారి చాలా ఎక్కువగా అంటే 60-70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. ఇది చాలా అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..
Read Also: AP Half Day Schools: నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఆ స్కూళ్లకు మాత్రం సెలవులు..
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ఇక, ఇదే సమయంలో.. కోనసీమ జిల్లాలో 733 శాతం, విశాఖపట్నంలో 623 శాతం, శ్రీకాకుళంలో 429 శాతం, అనకాపల్లిలో 439 శాతం, కాకినాడలో 523 శాతం, కృష్ణా జిల్లాలో 564 శాతం, నెల్లూరులో 553 శాతం, కడపలో 646 శాతం, తిరుపతిలో 671 శాతం, అన్నమయ్య జిల్లాలో 386 శాతం, ఏలూరులో 353 శాతం వర్షపాతం మార్చి నెలలో నమోదు అయ్యింది.. అత్యల్పంగా అంటే ప్రకాశం జిల్లాలో 6 శాతం మాత్రమే నమోదైంది.. కర్నూలులో 16 శాతం, అనంతపురం 35 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 110 శాతం, నంద్యాల 123 శాతంలో వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా, మార్చిలో కురిసిన అకాల వర్షాలతో భారీ పంట నష్టం జరిగిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?