NTV Telugu Site icon

Bv Raghavulu: అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక..

Bv

Bv

Bv Raghavulu: విజయవాడలో నిర్వహిస్తున్న కామ్రేడ్ ఏచూరి సీతారం సంతాప సభలో ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, రామకృష్ణ, మాజీమంత్రి అంబటి రాంబాబు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖర్చులు తగ్గడం కోసమట.. ప్రజాస్వామ్యం పోయినా పర్లేదా అని ప్రశ్నించారు. ఖర్చు కోసం ప్రాణాలు తీసేయాలన్న హిట్లర్ వాదనలాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాదన ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Chelluboina Venugopal: వంద రోజుల కూటమి పాలనలో రాష్ట్రం బ్రష్టు పట్టింది..

ఇక, అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని.. అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. దేశం ఐక్యంగా ఉండదు.. ఒకే దేశం ఒకే ఎన్నిక వాదన.. సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ పార్టీని దేశంలో అభివృద్ధి చేసారు.. ప్రదీప్ పురకాయస్తా అనే ఇంజనీర్ ను మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం సీతారాం ఏచూరి పోరాడారు.. ప్రజాస్వామ్య రక్షణ అత్యవసరమైన సమయంలో సీతారాం ఏచూరి మరణం బాధాకరం అని ఆయన అన్నారు. ఇక, గత నాలుగు రోజులుగా తిరుమల లడ్డూ గొడవ జరుగుతోంది.. లడ్డు అంశంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. లడ్డులో వాడే ఉప్పు, శనగపిండి, పంచదార కూడా కల్తీ కావొచ్చు అన్నారు. ధనవంతుడైన ఆ దేవుడి దగ్గర పందికొక్కులన్నీ చేరాయి.. పవిత్రత అంటూ మాట్లాడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగాలి అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి కమ్యూనల్ సివిల్ కోడ్ అనే విధానాన్ని మారుస్తారంటా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే విధానమట.. జైల్లో నంబర్ల లాగా ఆధార్ నంబర్ మనందరి నంబర్ అవుతుందట.. అందరి మీద ఒక ఏకత్వాన్ని రుద్దడం.. విభజనకు దారి తీస్తుంది.. విశ్వగురువు కావాలంటే.. ప్రతీ దేశ పౌరుడు దేశంలో భాగంగా భావించాలి అని ఆయన అన్నారు.