Telugu Talli Flyover Accident: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Dead Two Injured In Vizag Telugu Talli Flyover Accident: విశాఖపట్నంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొస్తూ.. ఫ్లైఓవర్ మీద వెళ్తున్న ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయాడు. దీంతో.. అతని తలకి బలమైన గాయాలు తగిలాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి లా అండ్ ఆర్డర్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Twitter: రోజుకు 600ట్వీట్లు మాత్రమే చదవగలరు.. ఎలాన్ మస్క్ కొత్త రూల్
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
మరోవైపు.. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఫ్లైఓవర్ పై నుండి కిందపడిన జై కృష్ణ అనే వ్యక్తికి తలకు బలమైన గాయాలు కావడంతో, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు విజయవాడకు చెందినవాడు. మరో ఇద్దరిని యశ్వంత్ (అల్లిపురం), హరి కుమార్ (అక్కయ్యపాలెం)లుగా గుర్తించారు. వీళ్లిద్దరు విద్యార్థులను తేలింది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు వీరికి మెరుగైన సేవలు అందించి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. మద్యం మత్తులో కారుని నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు AP 39 LF 5999 నెంబర్ గల టాటా హేరియర్ కానుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!