Site icon NTV Telugu

Varla Ramaiah : పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి

Varla Ramaiah

Varla Ramaiah

TDP Politburo Member Varla Ramaiah once Again made comments on YCP Government.

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. ముఖ్యమంత్రి గారూ! మీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ వర్తించేదిగా వుండాలి అంటూ వర్ల రామయ్య విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు మీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులివ్వలేదని, ప్రైవేటు విద్యాసంస్థల బస్సులివ్వడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రైవేటు బస్సుల పైనా, ఇతర రవాణా వాహనాలపైనా ఎన్నో నిషేధాజ్ఞలు విధించారని, ఇప్పుడు, అధికార పార్టీ ప్లీనరీకి కూడా అవే నిషేధాజ్ఞలు విధించాలని ఆయన కోరారు. ఆర్టీసి బస్సులు గానీ, విద్యాసంస్థల బస్సులు గానీ ఇవ్వకూడదని, చట్టం అందరికీ ఒకేలా వుండాలి.

 

ప్రజాపాలనంటే, అందరికీ సమానహక్కులు కల్పించడమేనంటూ ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు. పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి అంటూ ఆయన చురకలు అంటించారు. అయితే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వర్ల రామయ్య పై కామెంట్లు చేశారు.

Exit mobile version