NTV Telugu Site icon

Odisha custodial assault: ఒడిశా ఘటనపై ఆర్మీ వర్సెస్ పోలీస్.. ఆర్మీ అధికారి- కాబోయే భార్యపై దాడి కేసు..

Odisha Custodial Assault

Odisha Custodial Assault

Odisha custodial assault: ఒడిశాలో ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసులు కస్టడీలో దాడి చేయడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పోలీసుల తీరు ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు స్పందించి, మహిళపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఘటన ఆర్మీ వర్సెస్ పోలీస్‌గా మారింది. చాలా మంది వెటరన్ ఆర్మీ అధికారులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేస్తున్నారు. ఈ ఘటనపై జనరల్ వీకే సింగ్(రిటైర్డ్) తో సహా ఆర్మీ వెటరన్లు ఈ సంఘటనను ‘‘అవమానం మరియు భయంకరమైనది’’గా పేర్కొన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా పోలీసులు దోషులుగా తేలితే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఒడిశా భరత్‌పూర్ పోలీస్ స్టేషణ్‌లో తనను కొట్టి, లైంగికంగా వేధించారని ఆర్మీ అధికారిని, తనను అక్రమంగా సెల్‌లో బంధించారిన సదరు మహిళ ఆరోపించింది. రోడ్డుపై జరిగిన గొడవపై జంట ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కేసు సంచలనంగా మారడంతో ఐదుగురు పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు.

Read Also: Minister Satya Kumar Yadav: హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు.. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు..!

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్(రిటైర్డ్), మాజీ కేంద్రమంత్రి వీకే సింగ్ దాడికి పాల్పడిన పోలీస్ సిబ్బందిపై, వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకోవాలని కోరతూ..మేజర్ గౌరవ్ ఆర్య(రిటైర్డ్) ట్వీట్ చేశారు. “ఒడిశా పోలీసులు ఆర్మీ అధికారితో అనుచితంగా ప్రవర్తించారు మరియు అది నేరం. వారు ఒక మహిళను కూడా దారుణంగా ప్రవర్తించారు, అవమానించారు మరియు హింసించారు.. క్షమించేది లేదు.’’ అని ట్వీట్ చేశారు. మేజర్ జనరల్ హర్ష కకర్ (రిటైర్డ్) ఒడిశా పోలీసులపై విరుచుకుపడ్డారు. ఆర్మీ అధికారిని, ఓ మహిళని వేధించడంపై ధ్వజమెత్తారు.

అయితే, పోలీసులు దీనికి స్పందించారు. మద్యం తాగి నడపడంతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులతో గొడవకు దిగడం, పోలీస్ స్టేషన్‌లో గందరగోళం సృష్టించినందుకు ఆర్మీ అధికారిపై చర్యలు తీసుకున్నారా..? అని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు(ఒడిశా రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌) ప్రశ్నించారు. అయితే, తప్పు చేసిన పోలీస్ అధికారుల్ని చట్టప్రకారం శిక్షించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. వీకే సింగ్ ట్వీట్‌పై నాగేశ్వర్ రావు స్పందిస్తూ.. ఒక ఆర్మీ అధికారి మరియు అతని కాబోయే భార్య యొక్క మద్యం మత్తులో మరియు అసభ్య ప్రవర్తించారు అని అన్నారు. ఒడిశా పోలీసుల్ని దూషించడం కరెక్ట్ కాదని అన్నారు.

“భువనేశ్వర్‌లో, ఒక ఆర్మీ అధికారి మరియు అతని కాబోయే భార్య 10 పెగ్‌ల మద్యం సేవించి, అర్ధరాత్రి 2 గంటల సమయంలో కారు నడుపుతూ, తెల్లవారుజామున 2-30 గంటల సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థులతో గొడవ పడి, ఆపై భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో గొడవకు దిగారు. పోలీస్ స్టేషన్ లోపల గొడవ జరిగింది, సిబ్బంది PCR సహాయం కోరవలసి వచ్చింది” అని నాగేశ్వర్ రావు అన్నారు. పోలీసులు సైన్యాన్ని గౌరవిస్తుందని, భారత సైన్యం పేరును అవమానించిన ఆర్మీ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.