NTV Telugu Site icon

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. 

2.మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పూర్త‌య్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలోని మేక‌పాటి ఇంజ‌నీరింగ్ కాలేజీలో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వైఎస్ జ‌గ‌న్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజ‌ర‌య్యారు. ఉద‌యం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్ర‌త్యేక వాహ‌నంలో ఉద‌య‌గిరి వ‌ర‌కు రోడ్డు మార్గం ద్వారా త‌ర‌లించారు. 

3.హైద‌రాబాద్ న‌గ‌రం వేగంగా అభివృద్ది చెందుతున్న‌ది. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, క‌ల్చర్ సైతం మారిపోతున్న‌ది. ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా ఆలోచిస్తున్నారు. పైగా క‌రోనా త‌రువాత చాలా మార్పులు వ‌చ్చాయి. క‌రోనాకు ముందు ప్ర‌జ‌లు సినిమా థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసేవారు. కానీ, ఆ త‌రువాత మార్పులు వ‌చ్చాయి. సినిమా థియేట‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి ఒటిటి ద్వారా సినిమాలు చూస్తున్నారు. 

4.హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్‌ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది.

5.సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించిన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ను ఈరోజు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రిజ‌ర్వాయ‌ర్‌ను ప్రారంభించ‌డానికి ముందు కేసీఆర్ మ‌ల్ల‌న్న‌కు పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం రిజ‌ర్వాయ‌ర్‌ను ప్రారంభించి నీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ తెలంగాణ‌కే త‌ల‌మానికం అని అన్నారు.

6.టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 5 లో వినిపించే పేరు బాబు మోహన్. ఆయన పలికించే హావభావాలు.. నవ్వించే తీరు ప్రేక్షకులకు పొట్టచెక్కలవ్వాల్సిందే. కమెడియన్ గా, కొన్ని సినిమాలో హీరోగా, ఆ తరువాత రాజకీయ నాయకుడిగా బాబు మోహన్ ప్రస్థానం అందరికి తెలిసిందే. అయితే ఆయన జీవితంలో విషాదం కూడా అందరికి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకును రోడ్డుప్రమాదంలో పోగొట్టుకొని ఒంటరివాడిగా మిగిలినప్పుడు ఆయన పడిన భాధను వర్ణించడం కష్టమనే చెప్పాలి.

7.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూడ్ సేఫ్టీ అధికారులు, తూనికలు, కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాజమండ్రిలో ప్యారడేజ్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న హోటల్ నుండి చికెన్ తీసుకుని వచ్చి రాజమండ్రి హోటల్ లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వినియోగదారుడు పెమ్మనబోయిన రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు పై అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేశారు. అయితే హైదరాబాద్ నుండి హోటల్ కు దిగుమతి చేసుకుని తయారుచేసిన చికెన్ టిక్కా, బిర్యానీ శాంపిల్స్ ను అధికారులు సేకరించారు.

8 బైక్‌, కార్‌ ఇలా తాము వాడే వాహనంపై చలాన్‌లు ఉండటం.. రోడ్డుపైకి రాగానే పోలీసులు ఏ పక్క నుంచి వచ్చి ఆపి చలాన్‌ కట్టమంటారోనని భయంతో కాలం వెళ్లదీస్తున్న ఎంతో మంది వాహనాదారులకు హైదరాబాద్‌ పోలీసులు శుభవార్త చెప్పారు. పెండింగ్‌ చలానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల హైదారబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమయ్యారు. 

9.యువ కథానాయకుడు అదిత్ అరుణ్ తన పేరును ఇటీవలే త్రిగుణ్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ ‘కొండా’ తో పాటు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ హారర్ కామెడీ మూవీలో పూజిత పొన్నాడ అతనితో జోడీ కడుతోంది. మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్ట్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. త్రిగుణ్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హారర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుని, ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది.

10.గురువారం నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు జట్టు వర్గాలు చెప్తున్నాయి. దీంతో అతడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటాడని.. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాయి.