Site icon NTV Telugu

Today Ntv Top News

1.నేతలు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణ విషయం.. కానీ, కొన్నిసార్లు విమర్శలు చేస్తూ నోరు జారడం వివాదాస్పదంగా మారి.. విమర్శలకు దారితీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి.. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ వాఘ్మారేకు వచ్చింది.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

https://ntvtelugu.com/one-crore-reward-for-telangana-cm-kcr-tongue/

2.భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్‌ మీడియాలో స్పీడ్‌ పెంచారు విజయశాంతి.. ముఖ్యంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ.. ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనకు సీఎం కేసీఆర్‌ హాజరుకాకపోవడంపై, కేంద్ర బడ్జెట్‌ తర్వాత సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంపై ట్విట్టర్‌ వేదికగా ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు రాములమ్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుతో ఆయన పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం అడుగడుగునా స్పష్టమవుతోందని….

https://ntvtelugu.com/vijayashanti-sensational-comments-on-cm-kcr-and-asaduddin-owaisi/

3.గడిచిన ఐదేళ్లలో దేశంలో 655 పోలీస్‌ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 191 కేసులున్నాయని ఆయన చెప్పారు. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2022 మధ్య కాలంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయన్నారు. 117 ఉత్తరప్రదేశ్‌లో, అసోంలో 50, జార్ఖండ్‌లో 49, ఒడిశా 36, జమ్ముకాశ్మీర్‌ 35, మహారాష్ట్ర 26 ఎన్‌కౌంటర్‌ ఘటనలు చోటుచేసుకున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.

https://ntvtelugu.com/minister-of-state-for-home-affairs-nityananda-rai-on-encounters/

4.విశాఖలోని శారదా పీఠం వద్ద మంత్రి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు శారదా పీఠం వద్దకు చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని సీఐ స్పష్టం చేశారు.

https://ntvtelugu.com/minister-appalaraju-protest-at-vishaka-sarada-peetam/

5.బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం కలబోసిన ఈ భామ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అటు వైవాహిక జీవితంలోనూ సక్సెస్ గా నిలిచింది. పెళ్లి తరవాత అమ్మడు సినిమాలను కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ కోసం దీపికా, అనన్య పాండే,సిద్దాంత్ కలిసి నటిస్తున్న చిత్రం గెహ్రైయాన్. ఫిబ్రవరి 11 న ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో దీపికా, సిద్ధాంత్ ల మధ్య శృంగార సన్నివేశాలు మితిమీరి కనిపించడంతో ట్రోలర్స్ దీపికాను ఏకిపారేస్తున్నారు.

https://ntvtelugu.com/deepika-padukone-reacted-strongly-to-the-netizens-question/

6.ఫిట్ మెంట్, హెచ్ఆర్ఏ అంశాల పై ఉపాధ్యాయ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సమావేశమయ్యారు స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి. ఉపాధ్యాయ సంఘాల తీరు పై జేఏసీ నేతలు మండిపడ్డారు. పీఆర్సీ సాధన సమితి కృషి వల్ల హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నాం అన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. పీఆర్టీ ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు అయ్యేలా చూశాం. అదనపు పెన్షన్, సీసీఏ వచ్చింది. కొందరు మాతో ప్రతి అంశంలో చర్చలో ఉన్నారు..అప్పుడే వాళ్ళు చర్చ నుంచి బయటకు రావాల్సిందన్నారు.

https://ntvtelugu.com/jac-leaders-counter-attack-on-teacher-unions-allegations/

7.ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్‌ అదానీ ఆనందాన్ని ఒక్కరోజుకే పరిమితం చేశారు.. రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ.. 24 గంటల వ్యవధిలోనే అదానీని వెనక్కి నెట్టి.. మళ్లీ టాప్‌స్టాట్‌లోకి దూసుకొచ్చారు.. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ జాబితాలో ఏషియాలోనే నంబర్‌ ధనవంతుడిగా గౌతమ్‌ అదానీ అవతరించిన విషయం తెలిసిందే.. కాగా, 24 గంటలు తిరిగేసరికి ముకేష్‌ అంబానీ.. మళ్లీ నంబర్‌ వన్‌గా పేర్కొంది బ్లూంబర్గ్ బిలియనీర్స్‌ ఇండెక్స్‌.. దీని ఒకేరోజులో వారి సంపదలో తేడా రావడమే కారణం.. ఇక, అదానీ ఏషియా నంబర్‌ 2కి పరిమితం కాగా, ప్రపంచ ధనవంతుల్లో 11వ స్పాట్‌కు పడిపోయారు.

https://ntvtelugu.com/mukesh-ambani-again-on-top-in-the-race-for-wealth-surpassing-gautam-adani-to-become-asias-richest/

8.తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టడంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పుపట్టడం సిగ్గు చేటు. ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? పార్లమెంట్ తలుపులు మూసి, మైకులు బంద్ చేసి కనీస చర్చల్లేకుండా తెలంగాణ బిల్లు పెట్టిన మాట వాస్తవం కాదా?

https://ntvtelugu.com/mla-rajasingh-fires-on-trs-leaders-comments-on-modi-speech/

9.ప్రస్తుతం స్టార్లందరూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి , బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో అడుగుపెట్టి తమ సత్తాను చాటుతున్నారు. ఇక తాజాగా వెంకీ మామ సైతం బాలీవుడ్ బాట పట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు వెంకీ మామ డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారట. 

https://ntvtelugu.com/victory-venkatesh-in-salman-movie/

10.మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కావాల్సింది. అయితే ఆ సమయంలో కొవిడ్ 19 కేసులు ఎక్కువ ఉండటం, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలలో వీకెండ్ లాక్ డౌన్ పెట్టడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి తెలిపారు.

https://ntvtelugu.com/the-kashmir-files-release-date-fix/
Exit mobile version