Site icon NTV Telugu

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తే వాళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కినట్టే అన్పిస్తోంది. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సినిమా విడుదలై, రెస్పాన్స్ వచ్చే వరకూ కాస్త టెన్షన్ గానే ఉంటుంది. కానీ పాజిటివ్ టాక్ రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు బిగ్ రిలీఫ్ దక్కినట్టే. ముఖ్యంగా ఎన్టీఆర్ కు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి కాస్త గ్యాప్ దొరికినట్టే ! మరి రామ్ చరణ్ సంగతి ఏంటి ?

https://ntvtelugu.com/after-rrr-big-relief-to-ntr-but-not-for-charan/

2 కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే జాలేస్తుందని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రైతులను బలి చేస్తోందని ఆయన ఆరోపించారు. పుత్ర వాత్సల్యంతో బీజేపీపై కుట్ర చేస్తూ రైతులను ముంచుతున్నారని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ళపై రాజకీయం చేస్తున్నారని, చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్తోందని, రైతు పండించేది ధాన్యం మాత్రమే

https://ntvtelugu.com/kishan-reddy-made-comments-on-cm-kcr/

3.తెలుగు సాహిత్య ప్రపంచాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తెకు కీలక పదవి దక్కింది. శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 32 ఏళ్లుగా మద్రాస్‌ హైకోర్టులో మాలా ప్రాక్టీసు చేస్తున్నారు. మాలా 1989లో మద్రా్‌స-పుదుచ్చేరి బార్‌ అసోసియేషన్‌లో నమోదయ్యారు. అయితే న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా వీరిలో మాలా, ఎస్‌.సౌందర్‌ల పేర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.

https://ntvtelugu.com/sri-sri-daughter-mala-has-been-appointed-as-a-judge-of-the-madras-high-court/

4.టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని 8 సంవత్సరాలుగా ప్రస్తావిస్తున్నామన్నారు. మా డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతోందని, “నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. మా నోటీసులను అనుమతించక పోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఆయన వెల్లడించారు. 

https://ntvtelugu.com/nama-nageswara-rao-fired-on-bjp-government/

5. ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డి, మూడు రాజధానుల పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చారు. తరువాత మాట తప్పి మూడు రాజధానుల పేరుతో మాట తప్పారు.

https://ntvtelugu.com/amaravati-jac-condemns-jagan-statement-on-3capitals/

6.పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్స్‌ క్లియర్స్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌కు భారీగా స్పందన వస్తుంది.. ఇప్పటికే రూ.190 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వచ్చి చేరాయి… ట్రాఫిక్‌ చలాన్స్‌ క్లియరెన్స్‌ మరియు ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసేవారిపై వ్యవహించనున్నతీరుపై మీడియాతో మాట్లాడిన ట్రాఫిక్‌ జాయింట్ సీపీ రంగనాథ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. 4 రోజులో డిస్కౌంట్‌ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చిందన్న ఆయన.. మూడు కమిషనరేట్ల పరిధిలో అనూహ్య స్పందన వచ్చింది… 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్ క్లియర్ అయ్యాయి….

https://ntvtelugu.com/hyderabad-traffic-joint-cp-ranganath-about-pending-challans-and-new-rules/

7.న‌ట‌వ‌ర్గం: య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, అలియా భ‌ట్, అజ‌య్ దేవ‌గ‌ణ్, ఒలివియా మోరిస్, స‌ముతిరఖ‌ని, అలిస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్, శ్రియా శ‌ర‌ణ్, రాజీవ్ క‌న‌కాల‌, ఛ‌త్రప‌తి శేఖ‌ర్, రాహుల్ రామ‌కృష్ణ‌, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్
సినిమాటోగ్రఫి: కె.కె. సెంథిల్ కుమార్
సంగీతం: ఎమ్.ఎమ్.కీర‌వాణి
యాక్షన్: నిక్ పావెల్
నిర్మాత‌: డి.వి.వి. దాన‌య్య‌
ద‌ర్శక‌త్వం: ఎస్.ఎస్.రాజ‌మౌళి

https://ntvtelugu.com/rrr-review/

8. RRR కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సినీ ప్రేమికుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నిన్న రాత్రి నుంచి దేశవ్యాప్తంగా RRR మేనియా కన్పిస్తోంది. డప్పులు, టపాసులు, హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఈ నాలుగేళ్ళ నిరీక్షణను అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పెయిడ్ ప్రీమియర్లు, బెనిఫిట్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అంచనాలను అందుకోవడంలో RRR టీం సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. 

https://ntvtelugu.com/upasana-throws-papers-in-theatre-by-seeing-ram-charan-on-screen/

9.ఉక్రెయిన్‌పై సరిగ్గా నెల కిందట యుద్ధాన్ని ప్రారంభించింది రష్యా. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు క్రిమియా సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోకి వెళ్లాయి. అప్పుడు మొదలైన దాడులు నేటికీ రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ నామరూపాల్లేకుండా పోయింది. కొన్ని నగరాలు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి. 35 లక్షల మంది ఉక్రెయిన్‌ వీడి పొరుగు దేశాలు వలసపోయారు. అత్యధికంగా పోలాండ్‌లో 20 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ దాటి వెళ్లడానికి చూడా ఆస్కారం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు, బ్రిడ్జిల్ని పేల్చేశాయి రష్యా బలగాలు. జనావాసాలపైనా బాంబులు వర్షం కురి….

https://ntvtelugu.com/ukraine-civilian-death-count-crosses-1000-says-un/

10.బాలీవుడ్ లో ప్రస్తుతం బ్రేకప్ ల పరంపర నడుస్తుందా అన్నట్లు ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఒకరి తరువాత ఒకరు బంధాలను తెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు జంటలు తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ప్రేమ జంటలు కూడాబ్రేకప్ ప్రకటించి మళ్లీ సింగిల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన కుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పి సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా అని ప్రకటించింది.

https://ntvtelugu.com/shraddha-kapoor-rohan-shrestha-relationship-breakup/
Exit mobile version