Site icon NTV Telugu

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభించారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. 

https://ntvtelugu.com/ycp-mla-dharmana-prasad-rao-comments-on-high-court-judgement-in-ap-capital-issue/

2. సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న నేత కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆసాములకు 10శాతం రావాల్సిన యారాన్ సబ్సిడీని వెంటనే అమలు చేయాలి. కార్మికులకు కూలీ ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ రేట్లు ఇవ్వాలి. ప్రతి నేత కార్మికునికి నెలకు 23 వేల జీతం రావాలన్నారు జీవన్ రెడ్డి.

https://ntvtelugu.com/mlc-jeevan-reddy-solidarity-to-handloom-labours/

3.కేంద్రంలో బీజేపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యునివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీకి భూమి ఇచ్చినా ఇవ్వలేదన్న మెంటల్ పార్టీ బీజేపీ అంటూ విరుచుకుపడ్డారు.

https://ntvtelugu.com/errabelli-dayakarrao-fires-on-bjp/

4.బీజేపీ నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు.. గతంలో టీఆర్ఎస్‌ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను చించివేయడం.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అర్వింద్‌ విచారణకు హాజరుకాని కారణంగా నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ ఇష్యూ చేసింది..

https://ntvtelugu.com/nampally-court-non-bailable-warrant-issued-against-bjp-mp-dharmapuri-arvind/

5.యావత్ విశ్వవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా పట్టుకుంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ ఏర్పడుతోంది.

https://ntvtelugu.com/rrr-mania-at-box-office-live/

6.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి వెళ్లిన కేసీఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ చేరుకున్నారు.. ఆ తర్వాత దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్‌ శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి అమ్మవారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్‌ దంపతులు. 

https://ntvtelugu.com/telangana-cm-kcr-visits-kolhapur-mahalakshmi-temple/

7.కోలీవుడ్ స్టార్ హీరో శింబు కుటుంబం చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారునడిపి ఒక వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వం ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 18 అర్ధరాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్, తన మనవరాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇక ఈ విషయాన్ని గమనించినా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపడంతో వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి.

https://ntvtelugu.com/tamil-actor-simbus-car-runs-over-a-man-driver-arrested/

8.హిజాబ్‌ వ్యవహారంపై అత్యవసర విచారణకు మరోసారి నిరాకరించింది సుప్రీంకోర్టు.. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముస్లిం విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. విద్యార్థుల తరఫు సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు వార్షిక పరీక్షలో సమస్య ఏర్పడిందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.. విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేరు మరియు ఒక సంవత్సరం నష్టపోలేరు….

https://ntvtelugu.com/supreme-court-declines-giving-date-for-early-hearing-on-hijab/

9.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం ఆమె ప్రియుడు మైకేల్ తో విడిపోయాక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు కూడా కొత్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు క్రాక్ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరోపక్క కొత్త ప్రియుడు ర్యాపర్ శంతను హజరికాతో పీకల్లోతు ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తుంది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

https://ntvtelugu.com/shruti-haasans-bf-santanu-opens-up-about-their-relationship/

10.మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ అధికారికంగా తప్పుకున్నాడు. ఈ మేరకు తన సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు అతడు ప్రకటించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ధోనీ 204 మ్యాచుల్లో చెన్నైకు సారథ్యం వహించగా ఆ జట్టు 121 విజయాలు సాధించింది. నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. అంతేకాకుండా 9 సార్లు ఫైనల్ చేరింది.

https://ntvtelugu.com/ms-dhoni-resigned-to-chennai-super-kings-captaincy-in-ipl-2022/
Exit mobile version