Site icon NTV Telugu

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.చికెన్‌ ప్రియులకు ఇది చేదు వార్తే.. రోజురోజుకు చికెన్‌ ధరలు కొండెక్కుతున్నాయి. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. అలాగే హైదరాబాద్‌లో కూడా ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్‌ ధర రూ.281కు పెరిగింది. ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్‌ లెస్‌ చికెన్‌ కిలో రూ.281లుగా విక్రయిస్తున్నారు. అయితే సరుకు తక్కువగా ఉండటం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

https://ntvtelugu.com/chicken-price-hiked-in-telugu-states/

2.తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల సమావేశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. అయితే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నాయకత్వమే కావాలంటూ సమావేశమైనట్లు ఇటీవల స్పష్టత ఇచ్చారు. అయితే నేడు మరోసారి టీకాంగ్రెస్‌ సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి ఫోన్‌ చేసి సమావేశం నిర్వహించవద్దన్నారు. అంతేకాకుండా ఏమైనా సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్‌ ల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు

https://ntvtelugu.com/mla-jaggareddy-about-congress-seniors-meeting/

3.బీజేపీ రణభేరిపై ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఆయన మాట్లాడుతూ.. కడపలో బీజేపీ రణభేరి సభ పెట్టి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, కడపలో బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ అని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రకటిస్తే దాన్ని బీజేపీ అమలు చేయలేదన్నారు. బీజేపీ 7 సంవత్సరాలు రాయలసీమ ని మోసం చేస్తూనే ఉందని ఆయన విమర్శించారు. దొంగే దొంగా.. దొంగా అని అరిచినట్లు ఉంది, బీజేపీ వైఖరి అని అన్నారు. బీజేపీ రాయలసీమ ద్రోహి అని వ్యాఖ్యలు చేశారు.

https://ntvtelugu.com/apcc-tulasi-reddy-fired-on-bjp/

4.కృష్ణా జిల్లా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలోని వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో గన్నవరం వైసీపీ క్యాడర్ వైసీపీ కీలక నేత, పార్టీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

https://ntvtelugu.com/ysrcp-leaders-wrote-letter-to-vijay-sai-reddy-against-on-vallabaneni-vamsi-mohan/

5.ఏపీలో ఇటీవల ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతలు వియ్యంకులుగా మారుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ వియ్యంకులు అయ్యారు. తాజాగా టీడీపీ నేతలు బోండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు కలవబోతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతితో బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. త్వరలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరువురు నేతలు తమ పిల్లలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు.

https://ntvtelugu.com/bonda-uma-son-and-av-subba-reddy-daughter-engagement-on-march-27th/

6.నాణ్యత లేని భోజనం, అపరిశుభ్రమైన బోరు నీళ్లు విద్యార్థుల పాలిట ప్రాణ సంకటంగా మారింది.ఇటు స్కూల్స్ ,అటు హాస్టళ్లు, చివరికి బాసర ట్రిపుల్ ఐటీలో పెట్టే పుఢ్ పైన విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా పాయిజన్ కావడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాంతులు, విరేచనాలతో తరచూ ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థులపై ఓ కథనం.

https://ntvtelugu.com/food-poison-in-hostels-students-tension/

7.RRR మార్చి 25న దేశంలోనే అతిపెద్ద విడుదలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఈ మ్యాగ్నమ్ ఓపస్ మూవీ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి అనుమతి మంజూరు చేశాయి. హైదరాబాద్‌లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్‌లు మార్చి 25న ఉదయం 1 గంటలకు ప్రారంభమవుతాయి. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రీమియర్ షోలను కోటి రూపాయలకు విక్రయించారు. భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, అర్జున్, శ్రీరాములు, విజేత థియేటర్లలో ఉదయం 1 గంటలకు స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు.

https://ntvtelugu.com/rrr-hyderabad-benefit-shows-sold-for-a-record-price/

8.RRR Pre Release Event శనివారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా, ఆరోగ్య మంత్రి డా. కె. సుధాకర్, కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ భారీ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం వెనుక ఉన్న కారణాన్ని ముఖ్యమంత్రి వేదికపై వెల్లడించారు. ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కర్ణాటక సీఎం “నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న రియల్ హీరోల కథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. 

https://ntvtelugu.com/karnataka-cm-basavaraj-bommai-speech-at-rrr-pre-release-event/

9.సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ‘సర్కారు వారి పాట’ సినిమాతో టాలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని “పెన్నీ” సాంగ్ ప్రోమోలో సితార కన్పించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అసలు సితార టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు ఇదొక సూపర్ సర్పైజ్ అని చెప్పాలి. ఎలాంటి చడీచప్పుడూ లేకుండానే సితార ఉన్న ప్రోమోను విడుదల చేసి సాంగ్ పై భారీగ హైప్ పెంచేశారు మేకర్స్. అయితే ‘పెన్నీ’ సాంగ్ లోకి సితార సడన్ ఎంట్రీకి కారణం ఏంటి? అనే డౌట్ వచ్చింది కొంతమందికి. అయితే దీని వెనుక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది.

https://ntvtelugu.com/sitaras-appearance-in-penny-song-was-thamans-idea/

10.ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఎందుకంటే మొయిన్ అలీకి వీసా సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అతడు ఇండియా రావ‌డానికి ఇప్పటిదాకా వీసా లభించలేదని తెలుస్తోంది. మొయిన్ అలీ ప్రస్తుతం ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు.

https://ntvtelugu.com/csk-star-all-rounder-moeen-ali-will-miss-to-play-first-match-of-ipl-2022/
Exit mobile version